ఏపీని దగా చేయలేదు, హోదా అంటే..: జైట్లీ అర్థం, ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఏపీని మోసం చేశామని, దగా చేశామనడంలో ఎలాంటి నిజం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం నాడు అన్నారు. ఆయన తెలుగు ఛానల్ ఎన్టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఏపీ విషయంలో తమ నుంచి మోసం, దగా లేదని చెప్పారు.
ఏపీని తాము అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా కేంద్రమే నిధులు ఇస్తుందని చెప్పారు. చట్ట ప్రకారం అందాల్సినవి అన్ని అందుతాయన్నారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన హక్కులు అన్నీ తప్పకుండా వస్తాయని చెప్పారు.

ఏపీకి పూర్తి సహకారం అందుతుందని చెప్పారు. ప్రత్యేక హోదా ద్వారా అందే సాయమంతా ప్యాకేజీ ద్వారా అందుతుందని చెప్పారు. నిధుల విడుదలలో ఎలాంటి జాప్యం ఉండదన్నారు. ప్రత్యేక హోదా అంటేనే ఆర్థిక లబ్ధి అన్నారు. అది మేం చేస్తామని అభిప్రాయపడ్డారు.
ఏపీకి కేంద్రం నమ్మక ద్రోహం చేయడం లేదన్నారు. ప్యాకేజీ రూపంలో ఆర్థిక మద్దతు ఇస్తున్నామన్నారు. డీపీఆర్ రాగానే మరిన్ని నిధులు ఇస్తామని చెప్పారు. కాగా, బుధవారం రాత్రి జైట్లీ చేసిన ప్రకటన పైన ఏపీ భగ్గుమంటోన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications