సీఎం సీరియస్ ఆర్డర్స్: ఇక జనాల్లోకి అధికారులు కూడా.. వాయిస్ నోట్ పెట్టినా..

ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్షించారు. ఈ మేరకు ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించే అంశంపై అధికారులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు సేవల్ని సులభతర ప్రక్రియను మొదలు పెట్టామని.. ముందుగా 11 రకాల సేవల్లో ప్రక్రియలను కుదిస్తున్నామని అధికారులు తెలిపారు.

అలాగే ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఆన్‌లైన్లో ఫిర్యాదులు చేసే అవకాశాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు... మనమిత్ర వాట్సాప్‌లో కూడా ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించాలన్నారు. వాయిస్ మెసేజెస్ పెట్టినా వాటిని కూడా ఫిర్యాదులుగా స్వీకరించేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్రంలో మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో సుమారు 3 వేల ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉందని.. మూడు నెలల్లో సమస్య పరిష్కరించాలన్నారు.

CM Naidu Directs Officials to Simplify Public Services via RTGS and Resolve Connectivity Issues in AP

ఈ మేరకు నెట్‌వర్క్ సంస్థలతో మాట్లాడాలని సూచించారు. నవచేతన పేరుతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ చేపట్టిన ఎర్లీ చైల్డ్ హుడ్ డెవలప్మెంట్ స్క్రీనింగ్ విధానంపై సమావేశంలో అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పిల్లల ఎదుగుదల, వారి మానసిక, శారీరక పరిస్థితులను అధ్యయనం చేస్తున్నట్టు అధికారులు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 33,949 మంది పిల్లలను స్క్రీన్ చేసినట్టు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేవారితో పాటు ఇళ్లకు కూడా వెళ్లి స్క్రీనింగ్ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెప్పారు. స్క్రీనింగ్‌తో పాటు... ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై పైలెట్ ప్రాజెక్ట్ అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

నవ్వకుండా ఉండలేరన్న సీఎం చంద్రబాబు.. చిన్నారి వీడియో వైరల్ !
నవ్వకుండా ఉండలేరన్న సీఎం చంద్రబాబు.. చిన్నారి వీడియో వైరల్ !

సీఎం సూచనల మేరకు క్షేత్రస్థాయి పర్యటనల విషయంలో సర్క్యులర్ జారీ చేశామని అధికారులు తెలిపారు. ఈ మేరకు నెలలో సెక్రటరీలు 3 రోజులు, హెచ్‌ఓడీలు 6 రోజులు, జిల్లా కలెక్టర్లు 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సర్కులర్ జారీ చేసినట్టు అధికారులు వివరించారు. సమస్యలు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తక్షణ పరిష్కారాలు చూపాలని సీఎం ఆదేశించారు. పీజీఆర్ఎస్ విధానం మరింత మెరుగ్గా పనిచేసేలా స్టాండర్ట్ ఆపరేటివ్ ప్రోసీజర్స్ జారీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజీత్ బెనర్జీ, సీఐఐ ప్రతినిధులను వెంటపెట్టుకుని సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ కేంద్రానికి వచ్చారు. ఆర్టీజీఎస్ పనితీరును ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ సీఐఐ ప్రతినిధులకు వివరించారు.

సచివాలయంలో విజయ్ రికార్డు: ఎక్స్‌ప్రెస్ వేగంతో పాలన
సచివాలయంలో విజయ్ రికార్డు: ఎక్స్‌ప్రెస్ వేగంతో పాలన

ఏఐ సహా వివిధ టెక్నాలజీలను పరిపాలనలో ఏ విధంగా వినియోగిస్తున్నామనే అంశాన్ని భాస్కర్ వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆర్టీజీఎస్ పనివిధానానికి సంబంధించిన కేస్‌స్టడీస్‌ను సీఐఐ ప్రతినిధులకు వివరించారు. సీఐఐ గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్‌ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సీఐఐ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఈ సమావేశానికి సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+