బాబుకు లేఖ రాశాం, అలా అడిగితే నష్టం: ఏపీపై రాజ్యసభలో జైట్లీ కీలక ప్రకటన, రైల్వే జోన్‌పై గోయల్
Recommended Video

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభల్లో టీడీపీ, వైసీపీ ఎంపీల నిరసన నేపథ్యంలో ఏపీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో మంగళవారం ఓ ప్రకటన చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి.
విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ, రైల్వే జోన్ వంటి అంశాలపై టీడీపీ ఎంపీలు నిలదీశారు. దీంతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. ఏపీకి అన్యాయం చేశారన్న ఎంపీల ఆరోపణల నేపథ్యంలో వారు రాజ్యసభలో ప్రకటన చేశారు.

ఏపీకి ప్యాకేజీ ఇచ్చాం, హోదా ఇవ్వలేం
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని జైట్లీ చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామన్నారు. విభజన చట్టం అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. విదేశీ సంస్థల నుంచి ఏపీ రుణం తీసుకుంటే 90 శాతం కేంద్రం చెల్లిస్తుందని చెప్పారు.

నిధులు సమకూరుస్తున్నాం
ఏపీకి ఇవ్వాల్సిన నిధులను వివిధ మార్గాల్లో సమకూరుస్తున్నామని జైట్లీ ప్రకటించారు. ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శిని త్వరలో ఢిల్లీకి పిలిపిస్తామని చెప్పారు. రైల్వే జోన్ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో చర్చించాక సరైన పరిష్కారం దిశగా చర్యలు ఉంటాయని చెప్పారు.

ఆ విషయమై బాబుకు లేఖ రాశాం
ఈఏపీల నిధుల మంజూరుపై చర్చిస్తున్నామని జైట్లీ చెప్పారు. ఈఏపీల విషయమై జనవరి 3న ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశామని చెప్పారు. ఈఏపీ నిధులను నాబార్డ్ ద్వారా ఇవ్వమని చంద్రబాబు కోరుతున్నారని, అలా ఇస్తే రాష్ట్రానికి అప్పు సామర్థ్యం తగ్గుతుందని, ద్రవ్యలోటు వ్యత్యాసం ఏర్పడుతుందన్నారు. సమస్య పరిష్కారానికి మల్లగుల్లాలు పడుతున్నట్లు చెప్పారు. ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శితో జరిగే భేటీలో రాష్ట్రానికి రావాల్సిన ప్యాకేజీ విధివిధానాలు నిర్ణయిస్తామని చెప్పారు. ఆర్థిక లోటు కింద రూ.3900 కోట్లు మంజూరు చేశామని చెప్పారు.

రెవెన్యూ లోటుపై స్పష్టత లేదు, కొత్త ఫార్ములా
ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శితో చర్చలు జరపాలని తాము కేంద్ర ఆర్థిక కార్యదర్శికి సూచనలు చేశామని చెప్పారు. రెవెన్యూ లోటు భర్తీపై స్పష్టత లేదని జైట్లీ అన్నారు. కొత్త ఫార్ములాను రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పారు.

పొరుగు రాష్ట్రాలతో చర్చిస్తున్నాం
రైల్వే జోన్ అంశంపై పీయూష్ గోయల్ స్పందించారు. రైల్వే జోన్ అంశం కేంద్రం పరిశీలనలో ఉందని చెప్పారు. ఇతర రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయని, ఆ రాష్ట్రాలతో చర్చిస్తున్నామని చెప్పారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సరిహద్దు రాష్ట్రాలతో చర్చలు జరుగుతున్నాయన్నారు. యూపీఏ విభజన చట్టం సరిగా చేసి ఉంటే ఈ చిక్కులు వచ్చి ఉండేది కాదన్నారు. విశాఖ రైల్వే జోన్ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మాత్రమే విభజన చట్టంలో ఉందన్నారు.

ప్రధానితో భేటీ వివరాలు వెల్లడించేందుకు రాజ్‌నాథ్ నో
ప్రధాని మోడీతో జరిగిన భేటీ వివరాలను వెల్లడించేందుకు కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిరాకరించారు. టీడీపీకి చెందిన పార్లమెంటు సభ్యులు రెండు రోజులుగా ఉభయ సభల్లో నిరసన తెలుపుతోన్న విషయం తెలిసిందే. ఈ విషయమై చర్చించేందుకు మోడీ, రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. బయటకు వచ్చాక రాజ్‌నాథ్ విలేకరులతో వివరాలను వెల్లడించేందుకు నో చెప్పారు. ప్రధానితో భేటీకి వెళ్లే ముందు టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌ను ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications