లాస్ట్ బంతి వారే ఆడాలి: అశోక్, బోగిమంటల్లో బిల్లు దగ్ధం

విభజన బిల్లును వ్యతిరేకిస్తూ శాసన సభలో తీర్మానం చేయాలన్నారు. సమైక్యవాదానికి మద్దతు పలకని వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. విభజన జరిగితే చాలా సమస్యలు వస్తాయని, విద్యార్థులు, ఉద్యోగులు నష్టపోతారన్నారు. హైదరాబాదు అందరిదని, ఏ త్యాగానికైనా సిద్ధమన్నారు. ఎపిఎన్జీవోల్లో విభేదాల్లేవన్నారు. ఉద్యోగులమంతా కలిసే పోరాటం చేస్తున్నామన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. విభజనపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.
తాము ఎవరి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. విభజన వాదాన్ని సమర్థించిన వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదన్నారు. ప్రజాప్రతినిధుల బాధ్యతను గుర్తు చేసేందుకు తాము మరోసారి ఉద్యమం చేసేందుకు సిద్దమని అశోక్ బాబు చెప్పారు. ప్రజలను తెలంగాణ ప్రాంత నాయకులు రెచ్చగొట్టారని, సీమాంధ్రలో జరుగుతోంది ప్రజా ఉద్యమమని కరణం బలరాం అన్నారు.
తెలంగాణ బిల్లు పార్లమెంటులో పాస్ కాదని, అసెంబ్లీలో అందరూ వ్యతిరేకించాలని టిడిపి ఎంపి కొణకళ్ల నారాయణ అన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలన్నారు. కాంగ్రెసు పార్టీ సభ్యుడిగా ఉన్నందుకు బాధపడుతున్నానని ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. పార్లమెంటులో పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తానని చెప్పారు. కాగా, కృష్ణా జిల్లాలోను సమైక్యవాదులు బోగిమంటల వద్ద నిరసన తెలిపారు. బిల్లు ప్రతులను బోగి మంటల్లో దగ్ధం చేశారు.












Click it and Unblock the Notifications