హోదా కోసం ఏ త్యాగానికైనా సిద్ధం: తేల్చిసిన అశోక్, వారించిన చంద్రబాబు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఏ త్యాగానికైనా సిద్ధమేనని తెలుగుదేశం సీనియర్ నేత, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ నేపథ్యంలో సోమవారం విజయవాడలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్వహించిన సమావేశానికి అశోక్ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ బయటకు వస్తేనే... బీజేపీ సర్కారుపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుందన్న విపక్షం, ప్రజా సంఘాల వాదనలను గుర్తు చేసిన అశోక్ గజపతిరాజు.. కేంద్ర మంత్రి పదవికి ఇప్పటికిప్పుడు రాజీనామా చేసేందుకు తాను సిద్ధమేనని ప్రకటించారు. దీంతో చంద్రబాబు సహా సమావేశానికి హాజరైన వారంతా ఆయనను వారించారు.
'విపక్షాలు లక్ష చెబుతాయి. కానీ, రాష్ట్రానికి ఏది మంచిదో మనమే చూసుకోవాలి. కేబినెట్ లో ఉంటే ఒత్తిడి కొనసాగించడానికి, రాష్ట్రానికి మరిన్ని తెచ్చుకోవడానికి వీలవుతుంది. తెగదెంపుల వల్ల ప్రయోజనమేమీ ఉండదు' అని ఆయనను పార్టీ నేతలు వారించారు.












Click it and Unblock the Notifications