రేపటికి సభ: న్యూఇయర్‌పై నన్నపనేని ఆశ, చిరు భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చకు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, సమైక్యాంధ్ర తీర్మానం కోసం సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పట్టుబట్టిన నేపథ్యంలో శుక్రవారం శాసన సభ రేపటికి (శనివారం) వాయిదా పడింది. అంతకుముందు ఉదయం రెండుసార్లు సభ వాయిదా పడింది. తిరిగి మధ్యాహ్నం ప్రారంభమైనప్పటికీ ఇరు ప్రాంతాల ప్రతినిధులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. సభ వాయిదా పడినప్పటికీ ఎమ్మెల్యేలు పోడియం వద్ద నిరసన తెలుపుతున్నారు.
సమైక్యంలోనే న్యూ ఇయర్ వేడుకలు
వచ్చే ఏడాది(2015) కూడా సమైక్య రాష్ట్రంలోనే నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటామని తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి ఆశాభావం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రపై సభలో చర్చ జరగాలని ఆమె డిమాండ్ చేశారు.

రోబో ప్రధాని: యనమల
రోబో ప్రధాని దేశానికి చేసిందేమీ లేదని మండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. యూపిఏ హయాంలో అభివృద్ధి అయిన రంగం ఏదైనా ఉందా అంటే అది అవినీతి మాత్రమే అన్నారు.
తన వర్గం ఎమ్మెల్యేలతో చిరు భేటీ
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తన వర్గం ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. 2008 ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి రెండేళ్ల క్రితం కాంగ్రెసులో విలీనం చేశారు. విభజన నిర్ణయం నేపథ్యంలో పలువురు సీమాంధ్ర కాంగ్రెసు నేతలు టిడిపి, వైయస్సార్ కాంగ్రెసుల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరు తన వర్గం ఎమ్మెల్యేలతో భేటీ కానుండట ప్రాధాన్యత సంతరించుకుంది. చిరంజీవి నివాసంలో జరిగిన భేటీలో మంత్రులు గంటా శ్రీనివాస రావు, సి రామచంద్రయ్య, ఐదుగురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications