Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అసెంబ్లీకి వైసీపీ, స్పీకర్ అనూహ్య నిర్ణయం..!!

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అవుతున్నాయి. గవర్నర్ ప్రసంగం తో ఈ సమావేశాలు ప్రారంభించనున్నారు. వైసీపీ ఈ రోజు సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ప్రసంగం తరువాత బీఏసీ భేటీలో సమావేశాల నిర్వహణ అజెండా పైన నిర్ణయించనున్నారు. కాగా.. ఇదే సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల హాజరు వివాదం వేళ ఈ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్దమైంది. గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14న 2026-27 వార్షిక బడ్జెట్ ను ప్రభుత్వం సభలో ప్రవేశ పెట్టనుంది. తొలి రోజు సమావేశాలకు మాజీ సీఎం జగన్ సహా..వైసీపీ సభ్యులంతా సభకు హాజరు కానున్నారు. ఇదే సమయంలో స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ బడ్జెట్‌ సమావేశాల నుంచి కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డిజిటల్‌ విధానంలో సభ్యుల హాజరు నమోదు చేయనున్నారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఆదేశాల మేరకు సమావేశాలు ప్రారంభమయ్యే బుధవారం నుంచే ఈ విధానం అమల్లోకి తెస్తున్నట్లు అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ ప్రసన్నకుమార్‌ తెలిపారు. డిజిటల్‌ విధానం అమలు చేస్తున్న నేపథ్యంలో ఇకపై సభ్యులు హాజరు పట్టికలో సంతకం చేయనవసరం లేదని, దానిని తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా బయట రిజిస్టర్‌లో సంతకాలు చేసి జీతభత్యాలు తీసుకుంటుండడంపై చర్చ నడుస్తోంది.

assembly-speaker-key-decision-over-members-attendance-register-in-the-house-amid-budget-sessions-de

సభ్యుల హాజరు ఇక నుంచి

కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లో జరిగిన శాసనసభ స్పీకర్ల 86వ అఖిల భారత మహాసభలోనూ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు దీనిని ప్రస్తావించారు. అసెంబ్లీకి రాని సభ్యులకు 'నో వర్క్‌.. నో పే' విధానం అమలు చేయాలని, అవసరమైతే రైటు టు రీకాల్‌ విధానాన్ని తీసుకురావాలని స్పీకర్ సూచించారు. ఈ నేపథ్యంలో తాజాగా అమలు చేయనున్న డిజిటల్‌ విధానంతో వైసీపీ ఎమ్మెల్యేలకు చెక్‌ పెట్టినట్లు అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజా నిర్ణయం తో ఇక నుంచి సభలో సభ్యులు సభలో తమకు కేటాయించిన కుర్చీలో కూర్చున్న తర్వాతే.. ఏఐ ఆధారిత డిజిటల్‌ విధానం సంబంధిత సభ్యుడి హాజరును నమోదు చేస్తుంది. ఈ కారణంగా గతంలో మాదిరి సభకు ఆలస్యంగా వచ్చి సమావేశాలు ముగియకముందే వెళ్లిపోవడానికి ఆస్కారం ఉండదు. సభ్యులు సభలో ఎంత సమయం ఉన్నారనే విషయాన్నీ తెలుసుకోవచ్చు. ఏఐ ఆధారిత హాజరు విధానంలో అత్యాధునిక ఫేస్‌ రికగ్ననైజేషన్‌ టెక్నాలజీని వినియోగిస్తారు. సభలో పీటీజెడ్‌(పాన్‌.. టిల్ట్‌.. జూమ్‌) కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ నిర్ణయం పైన సమావేశాల ప్రారంభం వేళ ఆసక్తి నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+