హైడ్రా కమిషనర్ గా రంగనాధ్ ను తొలిగించండి- హైకోర్టు సంచలన ఆదేశాలు..!!

హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. హైడ్రా కమిషనర్ రంగనాధ్ ను వెంటనే హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. కోర్టు సూచన చేసినా అమలు చేయకపోవటం పైన హైకోర్టు సీరియస్ అయింది. హైడ్రా పరిధిని మించి ప్రైవేటు స్థలాల విషయాల్లో తీసుకుంటున్న నిర్ణయాల పైన అభ్యంతరం వ్యక్తం చేసింది. రంగనాధ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారికి హైడ్రా కమిషనర్ గా బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది.

హైడ్రా కమిషన్ పైన వేటు వేయాలని హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. లోతుకుంట భూము ల వ్యవహారంలో రంగనాధ్ తీరు పైన హైకోర్టు సీరియస్ అయింది. కోర్టు మూడు సార్లు ఆదేశాలు ఇచ్చిన అమలు చేయకపోవటం పైన న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషనర్ కోర్టుకు క్షమాపణలు చెప్పినా.. తాము పరిగణలోకి తీసుకోవటం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. గతంలోనూ పలు మార్లు రంగనాధ్ కోర్టు ఆదేశాలను బేఖాతర్ చేయటం పైన మండిపడింది. దీంతో, హైకోర్టు వెంటనే రంగనాధ్ ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

High Court sensational orders for Telangana Govt to remove Ranganaht as HYDRA commissioner

హైకోర్టు తాజా ఆదేశాలతో

కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం సరైంది కాదని హైకోర్టు పేర్కొంది. 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ క్షమాపణలు చెప్పారు. కోర్టులు, న్యాయ వ్యవస్థపై ఎంతో నమ్మకం ఉందంటూ రంగనాథ్‌ అఫిడవిట్‌ దాఖలు చేసారు. తాము లోతుకుంట సర్వే నెంబర్‌ 1, 2లోని భూమిలోకి వెళ్లలేదని వివరించారు. కోర్టుకు పిటిషనర్‌ అవాస్తవాలు చెప్పారని పేర్కొన్నారు. కాగా, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని కోర్టు గుర్తు చేసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఇన్ని ఎక్కువ ఎందుకు ఉన్నాయని ప్రశ్నించిన న్యాయస్థానం రంగనాధ్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హైడ్రా ఏర్పాటు నుంచి రంగనాధ్ కమిషనర్ గా కొనసాగుతున్నారు. పలు ప్రభుత్వ భూములను కాపాడారనే పేరు ఉంది. అదే విధంగా కొన్ని వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రయివేటు భూముల వ్యవహారంలో కోర్టులో దాఖలైన పిటీషన్ల విచారణ వేళ ఆదేశాలు అమలు చేయటం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు నేరుగా రంగనాధ్ ను హైడ్రా కమిషనర్ గా తప్పించాలని ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+