కృష్ణా హత్యలు, ఆధారాలు: కుట్రదారులు వారే..!
విజయవాడ: కృష్ణా జిల్లా పెద అవుటపల్లి వద్ద బుధవారం జరిగిన కాల్పుల ఘటనపై విజయవాడ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఆరుగురు నిందితులు పాల్గొన్న ఈ హత్యల కేసులో భూతం దుర్గారావు బావమరిది గణేష్ కుట్రదారుడిగా ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. దుర్గారావు కొద్ది నెలల క్రితం హతుడైన వ్యక్తి.
వారు వాడిన పల్సర్ బైక్, మరో కారును స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లో దుర్గారావు బంధువు శ్రీను ఉన్నట్లు గుర్తించారు. హత్యల అనంతరం నిందితులు మొదట పల్సర్ బైక్‌పై, తర్వాత రెండు కార్లలో రాజమండ్రి స్టేషన్‌కు చేరుకుని ఆ తర్వాత విశాఖ వెళ్లినట్లు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
నిందితులను మృతుల కుటుంబ సభ్యురాలు శ్రీదేవి గుర్తించారు. ఓ లాడ్జిలో ఆధారాలు దొరికాయి. ఆరుగురు నిందితుల్లో ఇద్దరు పినకమిడి వారికి చెందిన వారిగా, నలుగురు ముంబైకి చెందిన వారిగా గుర్తించారు. సంఘటన స్థలంలో దొరికిన వేలిముద్రలు సరిపోలినట్లుగా తెలుస్తోంది.

కాగా, ఈ కేసులో పొట్టిపాడు టోల్‌గేటు దగ్గర పొదల్లో పడివున్న ఎరుపు రంగు ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నిందితులు రెండు రోజుల క్రితం ఈ బైక్‌ను సెకండ్ హ్యాండ్‌లో కొనుగోలు చేసినట్లు వారు నిర్ధారించారు. హత్య కోసం నిందితులు ఉపయోగించిన కారు ఎవరిదో గుర్తించారు.












Click it and Unblock the Notifications