అవగాహనలేని పవన్! దీక్షలు చేస్తున్నారు: అచ్చెన్నాయుడు విమర్శలు
శ్రీకాకుళం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శల వర్షం కురిపించారు. ఉద్ధానం సమస్యలపై వెంటనే స్పందించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ పవన్ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే.
శ్రీకాకుళంలోని టెక్కలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉద్ధానం కిడ్నీ వ్యాధిగ్రస్థుల సమస్యను తొలగించడానికి ప్రభుత్వం చేపడుతోన్న చర్యలపై పవన్ కళ్యాణ్‌కు అవగాహన లేదని అన్నారు. గతంలో పవన్ చేసిన సూచనలతో ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని, రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రత్యేక హోదాపై కూడా పవన్‌తో పాటు వైయస్ జగన్మోహన్ రెడ్డి.. మోడీని విమర్శించకుండా సొంత ప్రయోజనాలకోసమే పాకులాడుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
కాగా, తిరుమల తిరుమతి దేవస్థాన మాజీ ప్రధానాచర్చకుడు రమణ దీక్షితులు చేస్తోన్న సంచలన ఆరోపణలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందిస్తూ.. టీటీడీలో జరుగుతోన్న సంఘటనలపై వేంకటేశ్వర స్వామే తీర్పు ఇస్తారని అన్నారు.












Click it and Unblock the Notifications