వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే అభినందనలు: ‘నో’ అంటూ మంత్రి విమర్శలు

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అభినందనలు తెలిపారు. మంత్రి నారాయణస్వామి ముందే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఓ వైపు ఎమ్మెల్యే ప్రసన్న.. చంద్రబాబుకు అభినందనలు తెలపగా, మంత్రి నారాయణ స్వామి మాత్రం టీడీపీ అధినేతపై విమర్శలు గుప్పించారు. ఒకే వేదికపై అధికార పార్టీకి చెందిన నేతలు భిన్న వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

చంద్రబాబుకు ప్రసన్నకుమార్ రెడ్డి అభినందనలు

చంద్రబాబుకు ప్రసన్నకుమార్ రెడ్డి అభినందనలు

ఆత్మకూరు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో మంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడారు. మొదట ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక ఎమ్మెల్యే పదవీకాలం మధ్యలో మృతి చెంది ఉప ఎన్నికల్లో ఆ కుటుంబసభ్యులు పోటీ చేస్తే.. అక్కడ పోటీ పెట్టకూడదని టీడీపీ ఒక నియమం పెట్టుకుని అమలు చేస్తుండటం మంచి విషయమన్నారు. ఇందుకోసం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు అభినందనలు తెలిపారు ప్రసన్నకుమార్ రెడ్డి.

ప్రసన్నకుమార్ వ్యాఖ్యలను అంగీకరించని మంత్రి నారాయణస్వామి

ప్రసన్నకుమార్ వ్యాఖ్యలను అంగీకరించని మంత్రి నారాయణస్వామి

మరోవైపు, బీజేపీపై ఆయన మండిపడ్డారు. మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చెందినప్పుడు బీజేపీ నాయకులు సానుభూతి తెలిపి, ఇప్పుడు పోటీ చేయడం దారుణమని ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. అనంతరం మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు గురించి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను అంగీకరించడం లేదని అన్నారు. అంతేగాక, టీడీపీ అధినేతపై నారాయణస్వామి విమర్శలు గుప్పించారు.

టీడీపీ కుట్రలంటూ చంద్రబాబుపై నారాయణస్వామి ఫైర్

టీడీపీ కుట్రలంటూ చంద్రబాబుపై నారాయణస్వామి ఫైర్

ఉపఎన్నికలో టీడీపీ పోటీ పెట్టకపోయినా.. ఇక్కడ వైసీపీకి వ్యతిరేకంగా రకరకాల కుట్రలకు పాల్పడుతోందని మంత్రి నారాయణస్వామి ఆరోపించారు. చంద్రబాబు పెద్ద వెన్నుపోటుదారుడని విమర్శించారు. పేదల సంక్షేమం కోసం సీఎం జగన్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి చెప్పారు.

అందుకే ప్రసన్నకుమార్ రెడ్డి బాధ్యతలంటూ నారాయణస్వామి

అందుకే ప్రసన్నకుమార్ రెడ్డి బాధ్యతలంటూ నారాయణస్వామి

సంగం మండలంలో 2019లో 2వేల ఆధిక్యం మాత్రమే వైసీపీకి లభించిందని.. ఇప్పుడు మాత్రం 20వేలకుపైగా ఆధిక్యం రావాలనే ప్రసన్నకుమార్ రె డ్డికి ఉపఎన్నికల బాధ్యతలు అప్పగించారని మంత్రి అన్నారు. ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీని గెలిపించాలని కోరారు. ఈ రోడ్ షోలో వైసీపీ నేతలు, భారీ ఎత్తున కార్యర్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు.

English summary
Atmakuru bypoll: YSRCP MLA Prasanna Kumar Reddy thanked TDP chief Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X