పవన్ కల్యాణ్‌తో సినిమా తీసి బ్యానరును మూసేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్
వెండితెరపై ఒక వెలుగు వెలిగి, ఆ తర్వాత తెర వెనుక కింగ్ మేకర్‌గా మారిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సరికొత్త సంచలనానికి తెరలేపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు భక్తుడిగా, ఇండస్ట్రీలో ఆయనకు అత్యంత ఆప్తుడిగా పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్, తన సినీ నిర్మాణ ప్రయాణానికి ఒక అపూర్వమైన ముగింపు పలకబోతున్నారు. తన ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్‌తో ప్రపంచమంతా ఉలిక్కిపడే రేంజ్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ నిర్మించి.. ఆ తర్వాత తన హోమ్ బ్యానర్ 'పరమేశ్వర ఆర్ట్స్'ను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
ఒక వైపు రీఎంట్రీ కోసం సరికొత్త ప్రొడక్షన్ హౌస్ ప్లాన్ చేస్తూనే, మరోవైపు తన కెరీర్‌ను మలుపు తిప్పిన పాత బ్యానర్‌కు పవన్ కళ్యాణ్ సినిమాతోనే 'గ్రాండ్ ఎండింగ్' ఇవ్వాలని ఆయన నిర్ణయించుకోవడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

'గబ్బర్ సింగ్' మ్యాజిక్ రిపీట్ కాబోతోందా?
గతంలో బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన 'గబ్బర్ సింగ్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మైలురాయిగా నిలిచిన ఆ సినిమా, నిర్మాతగా బండ్ల గణేష్‌ను టాలీవుడ్ టాప్ లీగ్‌లో నిలబెట్టింది. ఆ తర్వాత పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్‌పై బాద్‌షా, ఇద్దరమ్మాయిలతో, టెంపర్ వంటి బ్లాక్‌బస్టర్స్ వచ్చినా, పవన్‌తో గబ్బర్ సింగ్ ఇచ్చిన కిక్కే వేరని బండ్ల గణేష్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు.ఇప్పుడు మళ్లీ అదే మ్యాజిక్‌ను, అంతకు మించిన ఇంటెన్సిటీతో వెండితెరపై ఆవిష్కరించడమే తన జీవిత ఆశయమని ఆయన ప్రకటించారు.
చాలా కాలం తర్వాత ఒకే వేదికపై..
గత కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్స్, బండ్ల గణేష్ వ్యక్తిగత బిజీ వల్ల వీరిద్దరూ కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. అయితే, ఇటీవల ఒక సినిమా వేడుకలో ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే వేదికపై మెరిశారు. సుదీర్ఘ విరామం తర్వాత ఒకరినొకరు చూసుకున్న ఈ ఇద్దరూ ఎంతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ దృశ్యాలు, ఫొటోలు సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలోనే ట్రెండింగ్‌లోకి వచ్చాయి. దేవుడిని చూసిన భక్తుడిలా బండ్ల గణేష్ మొఖంలో కనిపించిన ఆనందం, పవన్ కళ్యాణ్ చూపించిన ఆప్యాయత అభిమానులకు కంటి నిండా విందును పంచాయి.
ఈ అపూర్వ కలయికే వీరి కాంబోలో రాబోయే కొత్త సినిమాపై అంచనాలను ఒక్కసారిగా స్కై హైకి తీసుకెళ్లింది. "నా సినీ కెరీర్‌లో నేను అత్యున్నత శిఖరాలకు చేరుకోవడానికి కారణం నా దేవుడు పవన్ కళ్యాణ్. అందుకే నా పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్‌లో రాబోయే చివరి సినిమా ఆయనతోనే ఉంటుంది. ప్రపంచమంతా చూసేలా ఒక మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్ తీస్తాను. ఆ సినిమా పూర్తయిన మరుక్షణమే నా బ్యానర్‌ను శాశ్వతంగా క్లోజ్ చేస్తాను. ఎక్కడైతే నా ప్రయాణం పీక్స్‌కు చేరిందో, అక్కడే దానికి ఎండ్‌కార్డ్ వేయాలనుకుంటున్నాను అని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications