అంబటి కారుపై టీడీపీ దాడి, ఎమ్మెల్యేకు గాయాలు

ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు వెళుతుండగా ఈ దాడి జరిగింది. ఈ దాడిలో అంబటి రాంబాబు, ముస్తఫాలకు స్వల్ప గాయాలయ్యాయని సమాచారం. వారు ప్రయాణిస్తున్న కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రస్తుతం మేడికొండూరులో ఉద్రిక్తత నెలకొంది.
ఈ సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీటీసీ సభ్యుల పైన కూడా దాడి జరిగింది. ఇవాళ ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ సభ్యులు శిబిరం నుండి ముప్పాళ్ల బయలుదేరారు.
మార్గమధ్యలో మేడికొండూరు వద్దకు రాగానే ప్రత్యర్థులు వీరు ప్రయాణిస్తున్న వాహనం పైన దాడి చేశారు. ఈ దాడి తెలుగుదేశం వారే చేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications