జనసేన కార్యాలయం పై దాడి : ఆర్దరాత్రి బీరు బాటిళ్లతో : ఘటన పై జనసైనికుల ఆగ్రహం..!
గుంటూరు లోని జనసేన కార్యాలయం పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బీరు బాటిళ్లతో అర్దరాత్రి జనసేన కార్యాలయం పై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనతో పార్టీ కార్యాలయ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ ఘటన పై పార్టీ నేతలతో పాటుగా కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు కార్యాలయం పై దాడి..
గుంటూరు లోని ఇన్నర్ రింగ్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని గత నెల 27న జన సేన పార్టీ అధినేత పవన కళ్యాన్ ప్రారంభించారు. పార్టీ శంఖారావం సభలో పాల్గొనేందుకు వచ్చిన పవన్ ఈ కార్యాల యంలో పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున పార్టీ నేతలు..కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. అయితే, ఆర్దరాత్రి కొందరు గుర్తు తెలియన వ్యక్తులు మద్యం సేవించి ద్విచక్ర వాహనాల పై వెళ్తూ జనసేన పార్టీ కార్యాయలం పై బీరు బాటిళ్లతో దాది చేసారు. పార్టీ కార్యాలయ ఆవరణలో ఉన్న సీసి కెమేరాల్లో దాడి ఘటన రికార్డు అయింది. కార్యాలయ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. దాడిలో కార్యాలయ అద్దాలు పగిలిపోయా యి. దాడికి కారణమైన వారిని గుర్తించే పని ప్రారంభించారు. అయితే , పార్టీ కార్యాలయ దాడి పై జనసేన నేతలు, పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications