తిరుమల వెళ్లేవారికి గమనిక.. నేటి నుంచే ఆ టికెట్ల రిజిస్ట్రేషన్..
తిరుమల వెళ్లే వారికి గమనిక.. నేటి నుంచే ఆర్జిత సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం కానునట్లు ఆలయ అధికారులు తెలిపారు.ఈ రిజిస్ట్రేషన్ ప్ర్రకియ మార్చి 20 వరకు కొనసాగుతుంది. జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. ఇక భక్తులు నేటి ఉదయం 10 గంటల నుంచి రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవచ్చు.
ఈ టిక్కెట్లతో పాటు శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం. ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను కూడా ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు టీటీడి తెలిపింది. అదే రోజు జ్యేష్ఠాభిషేకం ఉత్సవం టిక్కెట్లను కూడా విడుదల చేయనున్నారు. ఈ ఉత్సవం జూన్ 19 నుంచి 21వరకు జరగనుంది. భక్తుల కోసం ఈనెల 21న ఉదయం పదింటికి ఈ టిక్కెట్లను అందుబాటులో ఉంచనున్నారు.

ఆర్జిత సేవా టిక్కెట్ల రిజిస్ట్రేషన్ నేటి నుంచి ఈ నెల 20 ఉదయం 10 వరకు చేసుకునే వీలుంటుంది. అయితే ఈ నెల 22 మధ్యాహ్నం వరకు డబ్లు చెల్లించి టిక్కెట్లు కన్ఫామ్ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మార్చి 21 న మధ్యాహ్నం 3కి ఆర్జిత బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్త్రదీపాలంకారసేవల వర్చువల్ కోటా టికెట్లు విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది.
అంగ ప్రదక్షిణం టోకెన్లు విడుదల..
ఇక, ఈ నెల 23న ఉదయం 10 కి అంగ ప్రదక్షిణం టోకెన్లు, పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటాను విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా టికెట్లను కూడా విడుదల చేయనున్నారు. మార్చి 25న ఉదయం పదిగంటలకి జూన్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కూడా విడుదల కానున్నాయి.
మధ్యాహ్నం 3కి తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేయనున్నట్ల ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల27న ఉదయం పదకొండుకి తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను ఆన్‌లైన్‌లో ఉంచనున్నారు. మధ్యాహ్నం 12 కి నవనీత సేవ కోటాను, ఒంటింగంటకు పరకామణి సేవ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో ఉంచనుంది. భక్తులు ఇతర సేవల కోసం ఈ వెబ్‌సైట్‌ను https://ttdevasthanams.ap.gov.in సందర్శించవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications