రూ.లక్షను రూ.19 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్!
షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవారు ఆర్థిక నిపుణుల సలహాను కచ్చితంగా తీసుకోవాలి. డబ్బులపై క్రమశిక్షణ కూడా ఉండాలి. నిపుణుల సలహా వల్ల ఆ క్రమశిక్షణ అలవాటవుతుంది. ఎవరికో ఎక్కడో డబ్బులు వచ్చాయని తొందరపడి పెట్టుబడులు పెడితే నష్టపోయేది మీరే. మార్కెట్ ను జాగ్రత్తగా గమనిస్తుండాలి. కంపెనీల ప్రకటనలు, ఫలితాలు, ప్రణాళికలు తెలుసుకుంటుండాలి. వాటికి అనుగుణంగా పెట్టుబడి పెడుతుండాలి. ఇలా చేస్తే రిస్క్ తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మంచి లాభాలను ఆర్జిస్తారు. మల్టీబ్యాగర్ స్టాక్స్ పెట్టుబడిదారులకు ఊహించనిరీతిలో లాభాలను తీసుకువస్తుంటాయి. అలాంటి ఓ స్టాక్ రూ.లక్షను మూడు సంవత్సరాల్లో రూ.19 లక్షలు చేసింది. అదే. Aurionpro Solutions Limited (ఐటీ స్టాక్)
ఈ స్టాక్ పెట్టుబడిదారులపై కనకవర్షం కురిపించింది. ఏడాది వ్యవధిలో 250 శాతం పెరిగింది. గడిచిన మూడు సంవత్సరాల్లో ఈ అరియాన్‌ప్రో సొల్యూషన్స్ స్టాక్ 1800 శాతానికిపైగా పెరిగింది. 2020 జులై 17న రూ.51 వద్ద ఉండగా.. ప్రస్తుతం ఏకంగా రూ. 965 వద్ద నిలిచింది. సెన్సెక్స్ కంటే ఎక్కువ రాబడిని అందించింది. మూడేళ్ల క్రితం ఈ స్టాక్‌లో ఎవరైనా రూ. లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే వారి సంపద ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ. 19 లక్షలైంది. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 2.30 ట్రిలియన్ కోట్లుగా ఉంది.

ఇక ఈ షేరు 52 వారాల గరిష్ట విలువ రూ.1112.25 కాగా.. కనిష్ట విలువ రూ. 268.50. కంపెనీ ఫలితాలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 32.21 శాతం పెరిగింది. రూ.25.08 కోట్లుగా నమోదైంది. 2023 మార్చి త్రైమాసికంలో సేల్స్ కూడా 38 శాతానికిపైగా పెరిగాయి. వాటి విలువ రూ.19.66 కోట్లుగా నమోదైంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 33 శాతానికిపైగా పెరిగి రూ.40.44 కోట్లైంది.












Click it and Unblock the Notifications