చంద్రబాబు మాటే.. ఈసీ రమేష్ కుమార్ నోట: అవంతి, దాడి విమర్శలు
అమరావతి: స్థానిక ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శల దాడి కొనసాగుతోంది. విశాఖ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో మంత్రి అవంతి శ్రీనివాస్ రావు , వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీ కృష్ణ,పెందుర్తి ఏమ్యేల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు.

చంద్రబాబు చెప్పుడు మాటలు విని..
ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై తీవ్రంగా మండిపడ్డారు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ రావు. చంద్రబాబు హయాంలో కీలక పదవులు అనుభవించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. చంద్రబాబు చెప్పుడు మాటలు వింటు స్థానిక ఎన్నికలను రద్దు చేశారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో ఉండగా ఏనాడు స్థానిక ఎన్నికలు నిర్వహించలేదు.. నేడు వైఎస్సార్సీపీ ఎన్నికలు కి సిద్ధం ఐతే అడ్డు పడుతున్నారని అవంతి శ్రీనివాస్ రావు మండిపడ్డారు.

కరోనా అంటూ ఈసీ కుంటిసాకులు..
స్థానిక ఎన్నికలు జరగడం వల్ల గ్రామ స్థాయిలో అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. ప్రతిపక్ష టీడీపీ అభివృద్ది పనులకు అడ్డం తగలడము పనిగా పెట్టుకుందన్నారు. కేంద్ర సంస్థలను మేనేజే చేయడంలో చంద్రబాబు దిట్ట అని ధ్వజమెత్తారు.
కరోనా అన్నది ఎన్నికలను ఆపడానికి ఈసీ చెబుతున్న కుంటి సాకు అని.. వైఎస్సార్సీపీ విజయాన్ని ఎవరు ఆపలేరన్నారు. కరోనా వ్యాధిపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తుందన్నారు. విదేశాల నుండి వస్తున్న ప్రయాణికులను పరీక్షలు చేస్తూ.. ఆస్పత్రులలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని మంత్రి అవంతి శ్రీనివాస్ రావు తెలిపారు.

చంద్రబాబు కుటిల రాజకీయాలు
చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలకు ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సైతం లొంగిపోవడం బాధాకరమని వైసీపీ నేత దాడి వీరభద్రరావు అన్నారు.
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో దాడి వీరద్రరావు మీడియాతో మాట్లాడారు.
రమేష్ కుమార్ పై ఒత్తిడి తెచ్చి స్థానిక ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేయించారని చంద్రబాబుపై దాడి వీరభద్ర రావు మండిపడ్డారు.
Recommended Video

చంద్రాబాబు మాటే ఈసీ రమేష్ కుమార్ నోట
చంద్రబాబు మీడియా సమావేశంలో ఏ మాటలైతే అన్నారో అవే మాటలు ఎలక్షన్ కమిషనర్ నోటిలో వచ్చాయని చెప్పారు. చంద్రబాబుకి న్యాయం చేయడానికి రాష్ట్రాన్ని రమేష్ కుమార్ బలి చేశారని.. వ్యవస్థలను నాశనం చేసే విధంగా నిర్యయం తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఆరు వారాల ఎన్నికల కోడ్ వల్ల ప్రభుత్వ కార్యకలాపాలు ఆగిపోయాయని, ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ కళ్ళు తెరిచి నిర్ణయాన్ని మార్చుకోవాలని దాడి వీర భద్ర రావు కోరారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications