Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ రెడ్డిని జైలుకు పంపడం అజెండాగా డిల్లీలో విజయసాయి రెడ్డి .. అయ్యన్న పాత్రుడు, దేవినేని ఉమా కౌంటర్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి తమదైన శైలిలో ప్రశ్నలు సంధించారు.తెలుగుదేశం పార్టీ అధినేత ఢిల్లీకి వెళ్లి అభాసు పాలయ్యారని విమర్శించిన విజయసాయి రెడ్డి ని టార్గెట్ చేస్తున్న టిడిపి నేతలు విజయసాయి రెడ్డి మాటల్లో ప్రస్టేషన్ కనిపిస్తోంది అంటూ ఎద్దేవా చేశారు.

జగన్ అండ్ డ్రగ్స్ గ్యాంగ్ త్వరలో అరెస్ట్ అవ్వడం ఖాయం: అయ్యన్న పాత్రుడు

జగన్ అండ్ డ్రగ్స్ గ్యాంగ్ త్వరలో అరెస్ట్ అవ్వడం ఖాయం: అయ్యన్న పాత్రుడు

విశాఖ నుండి వెలి వేయడంతో జగన్ రెడ్డిని జైలుకు పంపడం అజెండాగా విజయసాయి రెడ్డి డిల్లీ లో తిరుగుతున్నాడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. కేంద్ర సంస్థల ఆధ్వర్యంలో ఏపి డ్రగ్స్ దందా పై విచారణ జరుగుతుందని, జగన్ అండ్ డ్రగ్స్ గ్యాంగ్ త్వరలో అరెస్ట్ అవ్వడం ఖాయం అంటూ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఇక ఇదే సమయంలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సైతం విజయసాయి రెడ్డి పై ధ్వజమెత్తారు.

ఏ ఆధారాలున్నాయని టీడీపీ నేతలను ఉగ్రవాదులు అంటున్నారు: దేవినేని ఉమా

ఏ ఆధారాలున్నాయని టీడీపీ నేతలను ఉగ్రవాదులు అంటున్నారు: దేవినేని ఉమా

మంగళగిరి టిడిపి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన దేవినేని ఉమా రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, టిడిపి నేతలను విజయసాయి రెడ్డి ఉగ్రవాదులు అంటున్నారని, మరి టిడిపి పార్టీ కార్యాలయాలపై దాడులు చేసినవారు అహింసా వాదులా అంటూ విరుచుకుపడ్డారు. ఏ ఆధారాలున్నాయని టీడీపీ నేతలను ఉగ్రవాదులని అంటున్నారని దేవినేని ఉమా విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు ఎవరికి నోటీసులు ఇస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

 ప్రధానిని కలవటానికి జగన్ కు, సాయిరెడ్డికి దేనికి భయం

ప్రధానిని కలవటానికి జగన్ కు, సాయిరెడ్డికి దేనికి భయం


ప్రధానిని కలిసేందుకు సీఎం జగన్, విజయసాయి రెడ్డి ఎందుకు భయపడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు దేవినేని ఉమ. ఢిల్లీ వెళ్లి మరీ చంద్రబాబునాయుడు పోరాడుతుంటే విజయసాయిరెడ్డికి వెన్నులో వణుకు పుడుతోందని దేవినేని ఉమా పేర్కొన్నారు. ఆర్థిక ఉగ్రవాది విజయసాయిరెడ్డి దగ్గర టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నడవడిక నేర్చుకోవాలా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు దేవినేని ఉమా. 28 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా సాధ్యం అన్నారని మరి ఇంత వరకు ప్రత్యేక హోదా పై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని దేవినేని ఉమా నిలదీశారు . ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏనాడైనా పార్లమెంట్లో మాట్లాడారా అంటూ ప్రశ్నించారు.

చంద్రబాబును టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి.. టీడీపీ ఎదురుదాడి

చంద్రబాబును టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి.. టీడీపీ ఎదురుదాడి

ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి ఢిల్లీలో చంద్రబాబు పడిగాపులు కాసినా కేంద్ర పెద్దల అపాయింట్మెంట్లు దొరకలేదు అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు .చంద్రబాబును మీడియా పట్టించుకోలేదని అతని నైజం తెలియడంతో ఏ పార్టీ కూడా బాబును దరిచేరనీయలేదు అని విమర్శించారు. ఏదో హడావుడి చేద్దామని వచ్చి అభాసుపాలై ఢిల్లీ నుంచి జారుకున్నాడు చంద్రబాబు అంటూ విజయ సాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు. ఏపీ పరువు తియ్యాలని చంద్రబాబు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారని, చంద్రబాబే పెద్ద ఉగ్రవాదని, డ్రగ్స్ దందా చంద్రబాబుకు, లోకేష్ కు మాత్రమే తెలుసనీ విమర్శించారు. చంద్రబాబు రాష్ట్రపతిని కలిసి ఏ వీడియోలు చూపించారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు సంగతి తెలిసే అమిత్ షా, నరేంద్ర మోడీలు కలిసే ఛాన్స్ కూడా ఇవ్వలేదని విజయసాయి రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలోనే టీడీపీ నేతలు రివర్స్ ఎటాక్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+