శేష జీవితం జైల్లోనే: జగన్‌పై అయ్యన్న, గాలి ఫైర్

హైదరాబాద్ : ముఖ్యమంత్రి అవుతానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పగటి కలలు కంటున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన జగన్‌పై ధ్వజమెత్తారు.

జగన్‌ శేష జీవితం జైల్లో గడపాల్సిందేనని అయ్యనపాత్రుడు వ్యాఖ్యానించారు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి మాదిరిగా జగన్‌ కూడా రాష్ర్టాన్ని దోచుకుంటాడనే ఉద్దేశంతోనే ప్రజలు ఆయనకు అధికారం ఇవ్వలేదని మంత్రి అన్నారు. వైఎస్‌ జగన్‌కు రాజకీయ అవగాహన లేదని మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు.

Ayyanna patrudu says YS Jagan is in day dreams

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధనకాంక్ష తప్పితే ప్రజాసేవ చేయాలన్న ఆకాంక్ష లేదని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు. వేలకోట్ల రూపయాలు సంపాదించిన జగన్‌ హుధుద్ బాధితులకు ఎలాంటి సహాయం అందించలేదన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆయన శనివారం మీడియాతో అన్నారు. సమైక్యాంధ్ర రెండు ముక్కలు కావడానికి కారణం వైయస్ రాజశేఖర రెడ్డే అని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే దురుద్దేశంతో వైయస్ తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+