బాబు చెప్పలేకపోతున్నారు: బొత్స, రాయలకు రెడీ: జెసి
అనంతపురం/విజయనగరం: ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సీమాంధ్రలో సమైక్యవాదం అంటూ, రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మాత్రం సమన్యాయం అంటూ ప్రజలను మభ్యపెడుతోందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ ఆదివారం మండిపడ్డారు.
విజయనగరం జిల్లాలోని వేపాడులో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరితో కలిసి బొత్స పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. విభజన జరిగినా సీమాంధ్ర ప్రాంతానికి ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామన్నారు. సమన్యాయం అంటే ఏమిటో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పలేని పరిస్థితిలో ఉందన్నారు.

రాయల తెలంగాణ: జెసి
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి రాయల తెలంగాణ ప్రస్తావన తెచ్చారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా జెసి అనంతలోని రంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. సమైక్యవాదమే తన నినాదం అన్నారు. విభజన అనివార్యమైతే రాయల తెలంగాణ అంటున్నానని చెప్పారు. కర్నూలు, అనంతపురంలను తెలంగాణలో కలపాలని సూచించారు. రాయల టి కోసం సీమ నేతల నుండి ప్రతిపాదనలు వస్తే ఆలోచిస్తామని తెలంగాణ నేతలు చెబుతున్నారన్నారు. దీనికి బిజెపి, తెరాస, టి కాంగ్రెసు నేతలు సానుకూలంగా ఉన్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications