విలక్షణమైన వివాహం: ముగ్గురు పిల్లల తల్లితో ఆరుగురు పిల్లల తండ్రి పెళ్లి!
ఉత్తరప్రదేశ్‌లో మెరాదాబాద్‌లోని రాణినగల్ గ్రామంలో ఓ మహిళ విలక్షణమైన వివాహం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. దాదాపు ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తన భర్తను కోల్పోయిన ముగ్గురు పిల్లల తల్లి అయిన తబస్సుమ్, ఆరుగురు పిల్లల తండ్రి అయిన మహమ్మద్ ఉమర్ అనే వ్యక్తితో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఉమర్‌కు ఆరుగురు పిల్లలు ఉన్నారు. అతడి మొదటి భార్య ఇప్పుడు అతనితో కలిసి జీవించడం లేదు. ఈ క్రమంల అతను తబస్సుమ్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వారు ఇప్పుడు తమ తొమ్మిది మంది పిల్లలతో కలిసి జీవించనున్నారు.
పాత జ్ఞాపకాలను దాటి పెరిగిన పరిచయం
రాణినగల్ గ్రామానికి చెందిన తబస్సుమ్ భర్త రియాజుల్ ఐదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దాంతో ముగ్గురు పిల్లల బాధ్యతను మోస్తూ ఆమె అత్తమామలతో కలిసి నివసిస్తోంది. మరోవైపు కోర్బంక్ ప్రాంతంలో మెకానిక్ గా పనిచేస్తున్న మహ్మద్ ఉమర్ కు ఆరుగురు పిల్లలు ఉండగా.. అతని మొదటి భార్య విడిపోయి మరో వివాహం చేసుకుంది. ఒంటరితనంతో ఉన్న వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం క్రమంగా బంధంగా మారింది. ఒకరినొకరు అర్థం చేసుకున్న అనంతరం కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు.

రహస్య పెళ్లి నుంచి గ్రామపంచాయతీ వరకు..
కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పకుండా తబస్సుమ్, ఉమర్ మొదట కలియార్ షరీఫ్ లో పెళ్లి చేసుకుని.. అనంతరం కోర్టు వివాహం కూడా చేసుకున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాలకు, బంధువులకు తెలియడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వివాదం ముదరడంతో గ్రామ పెద్ద జాహిద్ హుస్సేన్ సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. పంచాయతీలో ఇద్దరూ వారి ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నామని.. కలిసి జీవించాలనుకుంటున్నామని స్పష్టంగా వెల్లడించారు. తబస్సుమ్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆమె అత్తమామలు ఆమెతో ఎలాంటి సంబంధాలు ఉండవని తేల్చిచెప్పేశారు.
9 మంది పిల్లల బాధ్యత, కొత్త ప్రయాణం
పంచాయతీలో మహమ్మద్ ఉమర్ తబస్సుమ్‌తో పాటు వారి ముగ్గురు పిల్లల బాధ్యత తీసుకుంటానని వాగ్దానం చేశాడు. అద్దె ఇల్లు, కొనుగోలు చేసిన స్థలం, పిల్లల బాధ్యతకు సంబంధించి అఫిడవిట్లు కూడా సమర్పించినట్లు సమాచారం. ఈ విషయాలపై ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత పంచాయతీ ముగిసింది. ఆ తర్వాత తబస్సుమ్ తన సామాను సర్దుకుని, తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉమర్‌తో పాటు తన కొత్త ఇంటికి బయలుదేరింది. ఈ మొత్తం సంఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పుడు ఇద్దరికీ కలిసి తొమ్మిది మంది పిల్లలు
తబస్సుమ్‌కు ముగ్గురు పిల్లలు ఉండగా, ఉమర్‌కు ఆరుగురు ఉన్నారు. వారి వివాహంతో, వారి కొత్త కుటుంబంలో మొత్తం పిల్లల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ విషయం గ్రామంలో ఈ పెళ్లిని చర్చనీయాంశంగా మార్చింది. వారు కలిసి ఉండాలని నిర్ణయించుకుని, తమ పిల్లల బాధ్యతను కూడా స్వీకరించారు. అయితే వారి పిల్లలందరూ కలిసి జీవిస్తారా లేక వేర్వేరుగా ఉంటారా అనేది ఇంకా స్పష్టత రాలేదు.
3 बच्चों की मां फरजाना बेगम को हुआ 6 बच्चों के अनवर मियां बाप से प्यार, अब सभी 9 बच्चे रहेंगे एक साथ।
— राजपूत सवित सिंह (@Savit12) August 20, 2026
मामला मुरादाबाद के भोजपुर थाना क्षेत्र के रानीनागल गांव का है। pic.twitter.com/ZlqIGZiQ6d












Click it and Unblock the Notifications