తీహార్ జైల్లో కన్నుమూసిన కాంగ్రెస్ దిగ్గజం ..! సిక్కు అల్లర్ల కేసులో జీవిత ఖైదీ..!

కాంగ్రెస్ దిగ్గజ నేత, మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ (Sajjan Kumar) ఇవాళ తీహార్ జైల్లో కన్నుమూశారు. 1984 నాటి సిక్కుల ఊచకోత కేసులో దోషిగా నిర్ధారణ అయిన ఆయనకు కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో ఆయన తీహార్ జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఇవాళ ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సజ్జన్ కుమార్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. గాంధీ కుటుంబానికి విధేయుడిగా పేరున్న 80 ఏళ్ల సజ్జన్ కుమార్ జీవితం అలా ముగిసిపోయింది.

ఇథనాల్ దెబ్బకు రికార్డు స్దాయికి పంచదార ధరలు..! జనం గగ్గోలు..!
ఇథనాల్ దెబ్బకు రికార్డు స్దాయికి పంచదార ధరలు..! జనం గగ్గోలు..!

1984 అక్టోబర్ 31 తేదీన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె బాడీ గార్డులే దారుణంగా కాల్చి చంపారు. ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో తీవ్రవాదుల ఏరివేత కోసం అమృత్ సర్ లోని సిక్కుల పవిత్ర స్వర్ణదేవాలయంలోకి బూట్లతో సైనికుల్ని పంపారన్న కోపంతో వారు ఆమె హత్యకు పాల్పడ్డారు. అయితే ప్రధాని ఇందిర హత్యతో కాంగ్రెస్ శ్రేణులు రగిలిపోయాయి. సిక్కుల్ని టార్గెట్ చేస్తూ పలు రాష్ట్రాల్లో దాడులకు దిగారు. ఆ తర్వాత ఇవి కాస్తా ముదిరి హత్యల వరకూ వెళ్లాయి.

Sajjan Kumar Dies at 80 in Jail Former Congress MP Was Convicted in 1984 Riots Case
దెబ్బకు దెబ్బ తీసిన భారత్..! పాక్ కవ్వింపు చర్యకు ఢిల్లీలో దీటైన జవాబు..!
దెబ్బకు దెబ్బ తీసిన భారత్..! పాక్ కవ్వింపు చర్యకు ఢిల్లీలో దీటైన జవాబు..!

అలా ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలలో చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు కారకులుగా ఆరోపణలు ఎదుర్కొని, దోషిగా కూడా తేలిన నేతల్లో సజ్జన్ కుమార్ కూడా ఒకరు. జాట్ నేత అయిన సజ్జన్ కుమార్.. ఇందిర మరణాన్ని జీర్ణించుకోలేక ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల్ని రెచ్చగొట్టి సిక్కుల ఊచకోతకు కారకులయ్యారనే ఆరోపణలు వచ్చాయి. వీటిపై కోర్టుల్లో సుదీర్ధ విచారణ తర్వాత సజ్జన్ కుమార్ పై మోపిన అభియోగాలు వాస్తవమని రుజువయ్యాయి. దీంతో ఆయన్ను కోర్టు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచీ తీహార్ జైల్లోనే ఉంటున్న సజ్జన్ కుమార్.. ఇవాళ మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+