సోషల్ మీడియా రేస్-మోడీ కేబినెట్లో టాప్ ఎవరంటే ?- కాంగ్రెస్ లెక్కలు కోరిన రాహుల్..!
ఇది సోషల్ మీడియా (Social Media) కాలం. అంతకు మించి జెన్ జీ కాలం. యువతకు చేరువ కాకుండా, పాత చింతకాయ పచ్చడి రాజకీయాలతో, విధానాలతో కాలం గడిపేద్దామనుకుంటే అస్సలు కుదరదు. ఈ సత్యం నిన్న మొన్నటి కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుక, ఢిల్లీలో చేసిన నిరసలు, వాటికి దేశవ్యాప్తంగా వచ్చిన స్పందన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు తాజాగా తెలిసొచ్చింది. అప్పటికే సోషల్ మీడియాను కేవలం ప్రత్యర్దులపై బురదజల్లేందుకు, అప్పుడప్పుడూ తమ ప్రచారాలకు వాడుతున్న ఈ రెండు పార్టీల నేతలకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది. దీని పర్యవసానాలు ఇప్పుడు కేంద్రంలోనూ, కాంగ్రెస్ లోనూ కనిపిస్తున్నాయి.
కాక్రోచ్ ఉద్యమంలో జెన్ జీ సత్తాను వెంటనే గుర్తించిన ప్రధాని మోడీ (PM Modi).. రాత్రికి రాత్రి ఇన్ స్టాలో రీల్స్ చేసి షేర్ చేయడం ప్రారంభించారు. అంతే కాదు ఇన్ స్టాతో పాటు ఇతర సోషల్ మీడియా హ్యాండిల్స్ లో యాక్టివ్ గా ఉంటూ యువతకు చేరువ కావాలని కేబినెట్ మంత్రులకు తేల్చిచెప్పేశారు. ఈ నెల రోజుల్లో ఇది ఎంతవరకూ అమలైందన్న దానిపై తనతో పాటు తన కేబినెట్ మంత్రులకు ప్రధాని మోడీ ర్యాంకులు కూడా ఇచ్చారు. ఇందులో ఆయనే టాప్ గా నిలవడం విశేషం. మిగతా మంత్రులంతా ఆయన కంటే వెనుకే ఉన్నారు. అయితే వారి ర్యాంకులు విడిగా బయటపెట్టలేదు. మే 1 నుంచి ఆగస్టు 15 వరకూ సోషల్ మీడియా యాక్టివిటీ ఆధారంగా ఈ ర్యాంకులిచ్చారు. ఇన్ స్టా, ఎక్స్, ఫేస్ బుక్ లో మంత్రుల పోస్టుల ఆధారంగా ఈ ర్యాంకులిచ్చారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా కాక్రోచ్ ఉద్యమంతో జెన్ జీ ప్రభావాన్ని పూర్తిగా గుర్తించింది. అప్పటికే యువతకు చేరువయ్యేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్న రాహుల్ గాంధీ.. ఆ విషయంలో తమ పార్టీ నేతల్ని మాత్రం దూకుడుగా ఉంచలేకపోతున్నారు. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఉత్తరాఖండ్ పర్యటన సందర్భంగా నిర్వహించిన సభ తర్వాత ఆ సభా స్ధలిని కర్ణిసేన శుద్ధీకరణ చేయడంపై ఆయన రాజ్యసభలో మండిపడ్డారు. ఆ తర్వాత గోవా వెళ్లి అక్కడ నిర్వహించిన సభలోనూ బీజేపీని తీవ్రంగా టార్గెట్ చేసారు. అయినా కాంగ్రెస్ లో ఇతర నేతల నుంచి ఆయనకు సహకారం కరువైంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తాజాగా నిర్వహించిన ఏఐసీసీ సమావేశంలో ప్రస్తావించారు. దీంతో అక్కడే ఉన్న రాహుల్ గాంధీ (rahul gandhi) స్పందించారు. వెంటనే కాంగ్రెస్ సోషల్ మీడియా ఛీఫ్ సుప్రియా శ్రీనటేను తమ పార్టీ నేతలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉన్నారో తెలిపే రిపోర్టు తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు.













Click it and Unblock the Notifications