Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో బెయిల్‌పై ఉన్నవారు త్వరలో జైలుకే: ప్రకాశ్ జవదేకర్ సంచలనం, వైసీపీ, టీడీపీలపై నిప్పులు

హైదరాబాద్: ఏపీ ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగ్రహ సభలో పాల్గొని ప్రసంగించారు. కేంద్రం నిధులిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తన పేరుతో ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. అంతేగాక, పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

బెయిల్‌పై ఉన్నవారు జైలుకే అంటూ ప్రకాశ్ జవదేకర్ సంచలనం

బెయిల్‌పై ఉన్నవారు జైలుకే అంటూ ప్రకాశ్ జవదేకర్ సంచలనం

ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది నేతలు బెయిల్‌పై ఉన్నారని.. త్వరలో వారు మళ్లీ జైలుకు వెళ్లే అవకాశం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని కొందరు నేతలు బెయిలుపై ఉన్నారు.. త్వరలో జైలుకెళ్లే అవకాశం లేకపోలేదంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. నిధులు కేంద్రానివి.. స్టిక్కర్లు రాష్ట్రానివన్నారు. ఏపీలో ఇది విచిత్రమైన పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. రూ. 1.60 లక్షలను పీఎంఏవై కింద ఇస్తే జగనన్న కాలనీలంటున్నారని విమర్శించారు. అవి జగనన్న కాలనీలు కాదు.. మోడీ కాలనీలన్నారు. సమగ్ర శిక్షాభియాన్ ద్వారా యూనిఫాములను కేంద్రం ఇస్తుంటే జగనన్న కానుక అనే స్టిక్కర్ అంటించారని మండిపడ్డారు. వైద్యారోగ్య నిధులను కూడా కేంద్రమే ఇస్తున్నా.. జగన్ స్టిక్కర్లు అంటిస్తున్నారని విమర్శించారు.

ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ అంటూ ప్రకాశ్ జవదేకర్

ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ అంటూ ప్రకాశ్ జవదేకర్

ఏపీలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. తన ఉపన్యాసంలో పుష్ప సినిమాను ప్రస్తావించారు ప్రకాష్ జవడేకర్. ఎర్రచందనం స్మగ్లింగ్ పై పుష్ప సినిమాలో చూపించారు.. ఏపీలో అలాంటి పరిస్థితే ఉందన్నారు. ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోన్నా సిట్‌ను ఎత్తేశారని మండిపడ్డ ఆయన.. వృద్ధాప్య ఫించన్లను నేరుగా వేయకుండా వాలంటీర్ల ద్వారా ఇస్తున్నారని.. కానీ, మేం అవినీతిని అరికట్టేందుకు డీబీటీల ద్వారా నగదును అందిస్తున్నామని ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఏపీకి మంచి ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది.. ఏపీ ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వాలి.. ప్రజలు దీవిస్తే ఏపీలో బీజేపీ పెద్ద పార్టీ అవుతుందన్నారు. ఇక, ఏపీ అంటే నాకు ప్రేమ.. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించాను అని గత అనుభవానులు గుర్తుచేసుకున్నారు ప్రకాశ్ జవదేకర్, అంతేగాక, తనకు ఆంధ్రా భోజనం అంటే ఇష్టమన్నారు.

వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్ అవినీతి పార్టీలేనంటూ ప్రకాశ్ జవదేకర్

వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్ అవినీతి పార్టీలేనంటూ ప్రకాశ్ జవదేకర్

ఇక పోలవరం ప్రాజెక్టు గురించి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. పోలవరానికి రికార్డు టైంలో ఒక నెలలోనే పర్యావరణ అనుమతులు ఇచ్చానని.. తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ఇది జరిగిందని తెలిపారు. తాను నెలలో అనుమతులిస్తే.. ఇప్పటి వరకు చంద్రబాబు, జగన్ పోలవరాన్ని పూర్తి చేయలేకపోయారన్నారు. అమరావతి రాజధాని కోసం అటవీ భూములకు అనుమతులిచ్చాం.. కానీ, దురదృష్టకరం.. రాజధాని విషయంలో రెండూ పార్టీలు పోట్లాడుకుంటున్నాయని మండిపడ్డారు. వైసీపీ, టీఆర్ఎస్, టీడీపీల ప్రభుత్వాలు మూడూ అవినీతి పార్టీలేనని ఆరోపించారు. ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలేనని అన్నారు.

ఏపీలో విధ్వంసం జరుగుతోంది: జగన్ మాట తప్పారంటూ జవదేకర్

ఛార్‌ధామ్ అభివృద్ది చేస్తున్నాం. సౌకర్యాలు కల్పిస్తున్నాం. కాశీని అభివృద్ధి చేస్తున్నాం. అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్నాం. కానీ, ఏపీలో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. రథాలు తగులబెడుతున్నారు. దేశంలో నిర్మాణత్మకంగా వెళ్తుంటే.. ఏపీలో విధ్వంసం జరుగుతోందని ప్రకాశ్ జవదేకర్ ఏపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. మరోవైపు టీడీపీపైనా ప్రకాశ్ జవదేకర్ విమర్శలు ఎక్కుపెట్టారు. 2014 సాధారణ ఎన్నికల్లో నరేంద్ర మోడీ కారణంగానే ఏపీలో టీడీపీ గెలిచిందన్నారు. టీడీపీ అధికారంలో వచ్చిన తొలి రెండేళ్లు బాగానే ఉన్నారు.. కానీ, ఆ తర్వాత బీజేపీని.. మోడీని అనరాని మాటలు అన్నారని.. అందుకే 2019లో టీడీపీ ఓడిపోయిందన్నారు. ఇక, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మద్య నిషేధం అన్నారు.. కానీ, ఇప్పుడు మద్యం అమ్ముతున్నారన్నారు. పోలీసులను, టీచర్లను రిక్రూట్ చేస్తామన్నారు.. కానీ గాలికొదిలేశారని విమర్శించారు. రైతుల పంటల బీమా ప్రిమీయం కడతానన్న జగన్.. మాట తప్పారన్నారు. జగన్ ఇచ్చిన మాట తప్పి ఏపీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. ప్రకాశ్ జవదేకర్ హిందీ, ఇంగ్లీషులో ప్రసంగించగా.. బీజేపీ నేత పురంధేశ్వరి తెలుగులో అనువాదం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+