అసెంబ్లీ నుంచి అలిగి వెళ్లిపోయిన బాలయ్య...?
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేసిన బాలకృష్ణ బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. హిందూపురం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట వంటిది. ముఖ్యంగా నందమూరి కుటుంబానికి అచొచ్చిన నియోజకవర్గం.టీడీపీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్, ఆయన తనయుడు హరికృష్ణ ఇక్కడ నుంచే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వీరి తరువాత బాలకృష్ణ 2014,2019,2024 వరుస ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఈసారి పార్టీ కూడా అధికారంలోకి రావడంతో బాలకృష్ణకు మంత్రి పదవి ఖాయమని అనుకున్నారంతా. అయితే సామాజిక సమీకరణాలు అడ్డు రావడంతో పాటు, టీడీపీతో కూడా బీజేపీ, జనసేన పార్టీలతో కలిసి అధికారం పంచుకోవాల్సి రావడంతో, బాలకృష్ణకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆయన అభిమానులు పూర్తి నిరాశలో కూరుకుపోయారు. దీని కారణంగానే ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం బాలకృష్ణ అసెంబ్లీ నుంచి అలిగి వెళ్లిపోయారనే వాదన తెర మీదకు వచ్చింది. అయితే తాజాగా ఆయన సన్నిహితులు అలాంటిది ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు.

బాలకృష్ణ ఎప్పుడు కూడా పదవులపై ఆశలు పెట్టుకోలేదని, ఆయన మనస్తత్వం అలాంటి కాదని సన్నిహితులు చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో సినిమా షూటింగ్‌లకు బాలకృష్ణ గ్యాప్ ఇచ్చారని, ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడంతో ,మధ్యలోనే ఆగిపోయిన షూటింగ్‌లను ఆయన పూర్తి చేస్తున్నారని బాలకృష్ణ సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్లే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేకపోయారని బాలకృష్ణ అనుచరులు వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications