ఊహాగానాలకు తెర!: సీఎం పోస్ట్‌పై స్పందించిన బాలకృష్ణ, బాబుపై ఆసక్తికర వ్యాఖ్య
హైదరాబాద్: హిందూపురం శాసన సభ్యుడు, ప్రముఖ తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది. దీని పైన బాలకృష్ణ సోమవారం స్పందించారు.
తాను ముఖ్యమంత్రిని అవుతాననే వార్తలు అవాస్తవమని చెప్పారు. తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపే శక్తి చంద్రబాబుకే ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికీ చంద్రబాబే సీఎం అన్నారు. ఏపీలో త్వరలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని నెలకొల్పుతానని చెప్పారు.
ఓటుకు నోటు వ్యవహారం ఇరవై రోజులకు పైగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి రాజేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు త్వరలో ఏసీబీ నోటీసులు ఇస్తారనే ప్రచారం ఇటీవలి వరకు బాగా జరిగింది. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వవద్దని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు వినిపించాయి.

అయితే, మొన్నటి వరకు చంద్రబాబుకు నోటీసులు ఇస్తారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ ముఖ్యమంత్రి అవుతారనే వాదనలు వినిపించాయి.
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ.. బాలయ్య కాస్త నిరీక్షించి నీకే ఛాన్స్ అన్నారు. దాని గూడార్థం అందరికీ తెలుసు. కొందరు ఇతర పార్టీల నేతలు కొందరు బాలకృష్ణ సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. ముంబైకి చెందిన ఓ పత్రికలో అశోక గజపతి రాజు సీఎం అవుతారని వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications