Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ వాసుల కోసం బాలకృష్ణ తీపికబురు.. త్వరలో తుళ్ళూరులో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం!

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏపీ వాసులకు శుభవార్త చెప్పారు. నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విషయంలో ఆయన శుభవార్త చెప్పారు. క్యాన్సర్ చికిత్స అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రధాన ఉద్దేశంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా త్వరలో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

సమయానికి సరైన చికిత్స అందించేలా లేటెస్ట్ టెక్నాలజీ

నేడు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో బాలకృష్ణ పలు ఆధునిక వైద్య పరికరాలు, అంబులెన్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధికి సమయానికి సరైన చికిత్స అందితేనే రోగులు కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. అందుకే అత్యాధునిక సాంకేతికతను ఆస్పత్రిలో అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

Balakrishna said good news to ap people Basavatarakam Cancer Hospital construction will start soon in tulluru

ఏఐ సాంకేతికతతో త్వరిత సేవలు

బీడీఎల్‌ సీఎస్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా ఆస్పత్రికి అందించిన అడ్వాన్స్డ్‌ అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ యంత్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ యంత్రంలో ఏఐ సాంకేతికత ఉండటం వల్ల తక్కువ సమయంలోనే స్కానింగ్‌ పూర్తి చేసి, అత్యంత కచ్చితమైన ఫలితాలను అందించగలదని ఆయన వివరించారు. దీనివల్ల వైద్యులకు సరైన నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుందని, రోగులకు త్వరితగతిన చికిత్స అందించవచ్చని చెప్పారు.

దాతల పాత్రపై ఎమ్మెల్యే బాలకృష్ణ

ఆస్పత్రిలో ఇప్పటికే అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ, మరింత మెరుగైన సేవల కోసం కొత్త పరికరాలను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు.పేద రోగులకు నాణ్యమైన వైద్యం అందించడంలో దాతల పాత్ర కూడా కీలకమని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. వారి సహకారంతోనే ఆస్పత్రి వేలాదిమంది రోగులకు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో చికిత్స అందిస్తున్నదని చెప్పారు.

తుళ్లూరులో మరో వారంరోజుల్లో కొత్త క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం

అలాగే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు, దాతల సహకారం వల్లే ఆస్పత్రి ఈ స్థాయికి చేరుకుందని బాలకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్‌ ప్రణాళికలపై మాట్లాడిన బాలకృష్ణ, ఆస్పత్రిని మరింత విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని పరిధిలోని తుళ్లూరులో మరో వారం రోజుల్లో కొత్త క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆయనే ఈ సందర్భంగా ప్రకటించారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని క్యాన్సర్ రోగులకు సమీపంలోనే నాణ్యమైన చికిత్స అందుబాటులోకి రానుందని బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+