తెలంగాణ కుటుంబ సర్వేకు బాలకృష్ణ ఎగనామం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మంగళవారంనాడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బాలకృష్ణ ఎగనామం పెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సర్వేలో పాల్గొనని విషయం తెలిసిందే. చిరంజీవి మాత్రం సర్వేలో పాల్గొన్నారు.
నివాసంలో ఎవరూ లేకపోవడంతో ఎన్యుమరేటర్లు బాలకృష్ణకు, ఆయనకు కుటుంబానికి సంబంధించిన వివరాలను తెలుసుకోలేకపోయారు. వివరాలను సేకరించడానికి నోడల్ ఆఫీసర్ సదానందన్, మరో ఎన్యురేటర్ ఆఫీసర్ రమేష్ రెండు సార్లు బాలకృష్ణ ఇంటికి వెళ్లినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుటుంబ వివరాలను పిఎ నుంచి సేకరించిన తర్వాత ఎన్యుమరేటర్లు రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరంజీవి తన కుటుంబ వివరాలను అందించారు.
కాగా, మరో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ సర్వేలో పాల్గొన్నారు. తన కుమారుడు అభిరామ్ పేరును కూడా ఆయన నమోదు చేశారు. సర్వేలో పాల్గొన్నందుకు చంద్రబాబును, జూనియర్ ఎన్టీఆర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రత్యేకంగా ప్రశంసించారు.












Click it and Unblock the Notifications