బాలకృష్ణ అభిషేకం: ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు, ఉద్రిక్తం
అనంతపురం: స్వర్గీయ నందమూరి తారక రామారావు 19వ వర్ధంతి సందర్భంగా తెలుగు హీరో, తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ హిందూపురంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాభిషేకం చేశారు.
అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన నాన్నగారి ఆశయసాధన కోసం కృషి చేస్తానన్నారు.
చంద్రబాబు పాదయాత్ర

పశ్చిమ గోదావరి జిల్లాలోని వేలివెన్ను నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర ప్రారంభమైంది. దీనికి ముందు వేలివెన్నులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర వేలివెన్ను నుంచి కొవ్వూరు నియోజకవర్గం బ్రాహ్మణగూడెం వరకు 18 కిలోమీటర్ల వరకు సాగతుంది. ఈ పాదయాత్రలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
విశాఖలో ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు
విశాఖపట్నం జిల్లాలోని నక్కపల్లి మండలం, ఉద్దండపురం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి దుండగులు నిప్పుపెట్టారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పనేనని కొందరు టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications