రెండు రోజుల్లో గొంతు విప్పుతా: బాలరాజు సంచలనం

అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితోనూ ఆయన విభేదిస్తున్నట్లు కనిపిస్తున్నారు. అయితే, తనకు ముఖ్యమంత్రితో వ్యక్తిగతంగా ఏ విధమైన విభేదాలు లేవని, కాంగ్రెసు అధిష్టానానికి వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలపైనే తన ఆవేదన అని బాలరాజు శుక్రవారంనాడు అన్నారు. ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికే తాను రచ్చబండ కార్యక్రమానికి హాజరు కాలేదని చెప్పారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై రెండు రోజుల్లో తాను గొంతు విప్పుతానని ఆయన చెప్పారు. ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్ర విభజన ఆగుతుందని అనుకోవడం లేదని, అయితే తాను మొదటి నుంచీ సమైక్యవాదినే అని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనను అపుతామని ఎవరైనా అంటే అది ప్రజలను వంచించడమేనని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర కోసం చొక్కాలు చించుకుంటున్నవాళ్లు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజనను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ వ్యతిరేకించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకే తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఢిల్లీ యాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కొత్తగా ఏర్పడిన చత్తీస్‌గడ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలకే ఇప్పటికీ దిక్కు లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications