వైసీపీకి దూరంగా ఉంటున్నా : బాలినేని
ఎవరూ ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలుకావడం ఇప్పుడు ఆ పార్టీ నేతలకు పెద్ద సంకటంగా మారింది. ఎన్నికల్లో ఓడిపోవడంతో చాలామంది నేతలు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీకి రాజీనామా చేశారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ,అలీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇదే సమయంలో వైసీపీ కీలక నేత మాజీ మంత్రి, బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడనున్నారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది.
బాలినేని జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లుగా జిల్లాలో ప్రచారం జరుగుతుంది. తాజాగా దీనిపై బాలినేని స్పందించారు. ఆయన వైసీపీ అధిష్టానంపై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి తాను వైసీపీకి దూరంగా ఉంటున్నానని చెప్పి సంచలనం సృష్టించారు. ఈవీఎంలపై తాను చేస్తోన్న పోరాటానికి పార్టీ నుంచి ఎటువంటి మద్దతు రావడం లేదని ఆయన వాపోయారు. పైగా దీని గురించి పార్టీకి చెబుతామంటే కనీసం నా మాట వినే పరిస్థితుల్లో అధిష్టానం లేదని బాలినేని చెప్పుకొచ్చారు.

పైగా తాను జనసేనలోకి వెళ్తున్నానని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని బాలినేని చెప్పుకొచ్చారు. బహుశ జనసేనలోకి వెళ్లకుండా ఉండేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అనుకుంటున్నానని బాలినేని తెలిపారు. పార్టీ నన్ను పట్టించుకోకపోయిన ప్రజలు నా వెంట ఉన్నారని , నా పోరాటం ఆగదని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు పలు పోలింగ్ బూత్‌లలో రీ-కౌంటింగ్ నిర్వహించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి కోర్టుకెక్కారు.
వీవీప్యాట్లను పరిశీలించి స్లిప్పులను లెక్కించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా ఈసీ వ్యవహరించింది. వీవీప్యాట్లను పరిశీలించి స్లిప్పులను లెక్కించకుండా మాక్ పోలింగ్ నిర్వహించేందుకు వీలుగా 16 జులై 2024న ఈసీ టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను ఈసీ జారీ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన బాలినేని తరపు న్యాయవాది .. ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. దీనికి సంబంధించి తుది తీర్పు వెలువడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications