వైసీపీకి బిగ్ షాక్..పార్టీకి బాలినేని గుడ్ బై..?
వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఆ పార్టీకి నేతలు గుడ్ బై చెబుతున్నారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా మరో కీలక నేత వైసీపీని వీడనున్నట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీ కీలక నేత మాజీ మంత్రి, బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడనున్నారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. బాలినేని జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లుగా జిల్లాలో ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికే ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను అభినందిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది .అఖండ విజయం సాధించిన పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ బాలినేని ట్వీట్ చేశారు.హింసాత్మక ఘటనలకు తావు లేదని నిన్నటి రోజున మీరు ఇచ్చిన సందేశం హర్షనీయం అని బాలినేని ప్రశంసించారు.అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యాఖ్యలకు పూర్తి భిన్నమైన వాతావరణం నెలకొందని బాలినేని చెప్పారు .దీంతో ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాలినేని ఒంగోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు.

టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్ధన్‌పై 34 వేలకు పైగా ఓట్ల తేడాతో బాలినేని ఓటమి చెందారు. ఈక్రమంలో బాలినేని చేసిన ట్వీట్ ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. .గత ఎన్నికల్లో 151 సీట్లలో అధికారంలోకి వచ్చిన వైసీపీ..ఈసారి జరిగిన ఎన్నికల్లో కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలైయ్యాయి. టీడీపీ, జనసేన, బీజేపీ 164 సీట్లలో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.












Click it and Unblock the Notifications