బాలినేని అసలు సమస్య ఆయనతోనే - సీఎం తేల్చేస్తారా..!!

సీఎం జగన్ ఎన్నికల దిశగా అడగులు వేస్తున్నారు. పాలనా - పార్టీ పరంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి బాలినేని ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం కానున్నారు. పార్టీలో ముఖ్య నేతగా ఉన్న బాలినేని సమన్వయ కర్త బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తనకు ప్రాధాన్యత తగ్గటం పైన ఆయన ఆగ్రహంతో ఉన్నారు. పార్టీలోని ముఖ్యులే తన పైన కుట్ర చేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ ముఖ్యుల విషయంలో సీఎం జగన్ ఏం తేల్చబోతున్నారు.

సీఎంతో బాలినేని సమావేశం:ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ ముఖ్య నేతలకు సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. అందులో భాగంగా కొద్ది రోజులుగా మనస్థాపంతో పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్న బాలినేనికి సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. ఈ మధ్నాహ్నం సీఎం జగన్ తో బాలినేని సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో ప్రకాశం జిల్లాకు చెందిన సురేష్ ను కొనసాగిస్తూ తనను తప్పించటం పైన అప్పట్లోనే బాలినేని మనస్థాపం చెందారు. ఆ సమయంలో సజ్జల జోక్యంతో సీఎంను కలిసిన తరువాత బాలినేని శాంతించారు. ఇప్పుడు వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో పార్టీ సమన్వయర్త బాధ్యతల నుంచి తప్పుకున్నా..పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేసారు. సొంత నియోజకవర్గం ఒంగోలు పైనే ఒక ఫోకస్ పెడతానని వెల్లడించారు.

Balineni Srinivasa Reddy to meet CM Jagan, leads to curiosity in YSRCP cirlces in Prakasam Dist

బాలినేని ఓపెన్ అవుతారా:కొద్ది రోజులు బాలినేని నిర్ణయం పైన మౌనంగా ఉన్న అధినాయకత్వం ఇప్పుడు స్పందించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి నేరుగా బాలినేనితో చర్చించనున్నారు. పార్టీలోని కొంతమంది వ్యక్తులు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఒంగోలులో మీడియా సమావేశంలో బాలినేని కన్నీరు పెట్టుకున్నారు. జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత..మాజీ ఎంపీ..ప్రముఖ ధార్మిక సంస్థ బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తిని ఉద్దేశించి బాలినేని ఈ వ్యాఖ్యలు చేసినట్లు జిల్లాలో ప్రచారం సాగుతోంది. ఇద్దరు నేతలు పార్టీలో కీలకంగా ఉన్నారు. బాలినేనికి సీఎం జగన్ కీలకమైన తిరుపతి, కడప, నెల్లూరు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. పార్టీకి కంచుకోట లాంటి నెల్లూరులో చోటు చేసుకుంటున్న పరిణామాల నడుమ బాలినేని నిర్ణయం సమస్యగా మారుతోంది.

సీఎం ఇచ్చే హామీపై ఉత్కంఠ:బాలినేని కేవలం ఒంగోలుకే పరిమితం అవుతానని చెప్పటంతో ఇప్పుడు సీఎం జోక్యం చేసుకున్నారు. గతంలో బాలినేని ఇదే విధంగా మనస్థాపానికి గురైన సమయంలోనూ సీఎం జగన్ పిలిచి మాట్లాడారు. ఇప్పుడు మరోసారి కీలక బాధ్యతలు అప్పగించే ఉద్దేశంతోనే సీఎం నేరుగా బాలినేనితో మాట్లాడాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో బాలినేని చెబుతున్న పార్టీలోని ఆ ముఖ్య నేత ఇక నుంచి ప్రకాశం పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. పార్టీ సమన్వయ కర్తగా మూడు జిల్లాల్లో పార్టీ పరంగా బాలినేని మాటకే ప్రాధాన్యత ఇచ్చేలా హామీ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు సీఎం ముందు బాలినేని తన ఆవేదన మొత్తం బయట పెట్టబోతున్నారు. మరి..సీఎం నుంచి ఎటువంటి హామీ వస్తుందో..బాలినేని ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+