తుర్కిమిస్తాన్ దేశ భారత రాయబారిగా ఏపీ వాసి..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరింత గర్వకారణంగా నిలిచే ఘటన చోటు చేసుకుంది. బాపట్ల జిల్లాలోని ఇంకొల్లు మండలం ఇడుపులపాడు గ్రామానికి చెందిన బండారు విల్సన్‌ను భారత ప్రభుత్వం తుర్కిమిస్తాన్ దేశానికి భారత రాయబారిగా నియమించింది. భారత అత్యున్నత దౌత్య సేవ అయిన.. ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS)కు చెందిన విల్సన్ 2004 బ్యాచ్ అధికారి. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని స్వీకరించారు.
విదేశాంగ శాఖలో విశిష్ట సేవలు..
UPSCలో ఎంపికైన తర్వాత బండారు విల్సన్.. భారత విదేశాంగ సేవ (IFS)లో చేరారు. ఇంతకు ముందు వరకు ఆయన మడగాస్కర్ దేశంలో భారత రాయబారిగా విశిష్టంగా సేవలందించారు. ఆ దేశంలో ఉన్న భారతీయ సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చి, భారత్-మడగాస్కర్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసినందుకు ప్రశంసలు పొందారు. తన క్రమశిక్షణ, స్పష్టమైన దౌత్యపర దృష్టికోణం కారణంగా ఆయనను తుర్కిమిస్తాన్ భారత రాయబారిగా నియామకం జరిగింది.

కుటుంబం & విద్యాభ్యాసం..
విల్సన్ తల్లిదండ్రులు బండారు కృపారావు, ప్రిస్కెల్లా. వీరిద్దరూ ఉపాధ్యాయ వృత్తిలో పనిచేశారు. వారిద్దరి మార్గదర్శకత్వం, విద్యాపట్ల ఆసక్తి, క్రమశిక్షణ విల్సన్ విజయానికి ప్రేరణగా నిలిచాయి. విల్సన్ ప్రాథమిక విద్యను స్వగ్రామమైన ఇడుపులపాడు విద్యాపరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. 1995-96 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన అనంతరం.. ఉన్నత విద్యను కొనసాగించి, భారత అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 2004లో 272వ ర్యాంకు సాధించారు.
ఇతర పదవులు..
- 2022 సెప్టెంబర్ 26న బండారు విల్సన్ బాబును రిపబ్లిక్ ఆఫ్ మడగాస్కర్‌కు తదుపరి భారత రాయబారిగా నియమించారు.
- 2020 నుండి 2022 వరకు న్యూఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో డైరెక్టర్ మరియు జాయింట్ సెక్రటరీగా పనిచేశారు
- 2016 నుండి 2020 వరకు బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో కౌన్సెలర్గా సేవలు అందించారు. ఈ సమయంలో, ఆయన బీజింగ్‌లోని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సెక్రటేరియట్‌లో భారతదేశం యొక్క శాశ్వత ప్రతినిధిగా కూడా ఉన్నారు.
- 2014 నుండి 2016 వరకు న్యూఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు.
సర్వత్రా ప్రశంసలు..
తమ గ్రామానికి చెందిన వ్యక్తి అంత పెద్ద స్థాయికి చేరుకోవడంపై ఇడుపులపాడు గ్రామవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విల్సన్ నియామకాన్ని గ్రామానికి ఒక గర్వకారణంగా అభివర్ణిస్తూ.. గ్రామ యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ఎదగాలని సూచించారు.
Ambassador-designate to Turkmenistan Mr. Bandaru Wilsonbabu received his Letter of Credence from Hon'ble Rashtrapati ji Smt. Droupadi Murmu @rashtrapatibhvn in New Delhi today. @IndianDiplomacy pic.twitter.com/BJyEpyXQul
— IndiainTurkmenistan (@IndiainTurkmen1) October 8, 2025












Click it and Unblock the Notifications