పెద్ద నగదు నోట్ల రద్దుతో తండ్రి అంత్యక్రియలకు దూరమైన పిల్లలు

పలాస: పెద్ద నగదు నోట్ల రద్దు ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది. కొందరు నగదును మార్చుకోలేమనే మనస్థాపంతో చనిపోతే...మరికొందరు వివాహాలను వాయిదా వేసుకొన్నారు. చనిపోయినవారిని కడసారి చూసుకొనేందుకు కూడ వెళ్ళలేని పరిస్థితి మరికొందరిది.

మంగళవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం పెద్ద నగదు నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. చిల్లర మార్పిడి కోసం అష్టకష్టాలు పడ్డారు.ఈ కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరో వైపు చనిపోయిన వ్యక్తిని చివరి చూపు చూసేందుకు కూడ వెళ్ళలేని దయనీయస్థితి శ్రీకాకుళం జిల్లా వాసులది.

Photos : పాత నోట్లతో తిప్పలు

శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని టెక్కలికి చెందిన కొక్కిరి గురువులు అనారోగ్యంతో బుదవారం నాడు మరణించాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.వీరంతా హైద్రాబాద్ లో నివాసం ఉంటారు. హైదరాబాద్ లో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

banned currency effect on cremation in srikakulam

బుదవారం నాడు గురువులు మరణించిన విషయం హైద్రాబాద్ లో ఉన్న పిలలకు సమాచారం వచ్చింది.అయితే శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్ళేందుకు వారి వద్ద చిల్లర నగదు లేదు. వారి వద్ద పెద్ద నగదు నోట్లే ఉన్నాయి.ఈ నోట్లను మార్చుకొనేందుకు చేసిన ప్రయత్నాలు పలించలేదు. టెక్కలికి వెళ్ళేంందుకు వారు సాహసించలేకపోయారు.

మృతదేహాన్ని ఎక్కువ సేపు గ్రామంలో ఉంచనీయడం లేదు.దీంతో గురువులు సతీమణి నారాయణమ్మే భర్త అంత్యక్రియలను నిర్వహించారు. కనీసం చనిపోయిన వ్యక్తిని కడసారిని చూసేందుకు వెళ్ళలేని గురువులు కొడుకు, కుమార్తెలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+