భారీ నుండి అతిభారీ వర్షాలను ప్రకటించిన బంగాళాఖాతం!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఐఎండి సూచనల ప్రకారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇది వాయువ్య బంగాళాఖాతంలో బలపడిందని ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్సా తీరాల వైపు కదులుతూ ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఏపీలో ఈ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు
ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈరోజు అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, తూర్పుగోదావరి, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాలలో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఏపీలో వారంపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు
ఇక అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ వెల్లడించారు. బంగాళాఖాతంలో వాయుగుండంతో పాటు, ఏపీలో అనుకూలంగా నైరుతీ రుతుపవనాలు కూడా ఉన్నాయి. ఈ కారణాల వల్ల ఏపీలో వారం పాటూ అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆగస్టు 30, 31 తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలో అతి భారీ వర్షాలు కురుస్తాయి.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురువనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షం పడుతున్న సమయంలో బయట తిరగకుండా ఉంటే మంచిదని సూచిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పలనాడు జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications