చంద్రబాబు కేసు సీబీఐకి, ఉండవల్లి పిల్ వెనుక - అదే జరిగితే..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు(Chandra Babu) కేసుల వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటోంది. చంద్రబాబు 14 రోజులుగా రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. సీఐడీ చంద్రబాబు కస్టడీ కోరుతోంది. ఇలా న్యాయపరమైన..రాజకీయ వ్యవహారాలు ఆసక్తిగా మారిన వేళ మాజీ ఎంపీ ఉండవల్లి(Undvalli)తెర మీదకు వచ్చారు. హైకోర్టులో పిల్ దాఖలు చేసారు. స్కిల్ స్కాం కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. దీంతో, ఇప్పుడు ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంటోంది.

ఉండవల్లి పిల్ దాఖలుతో : చంద్రబాబును స్కిల్ స్కాం(Skill Scam)లో సీఐడీ అరెస్ట్ చేసింది. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. చంద్రబాబుపై అక్రమ కేసుతో వేధిస్తున్నారని టీడీపీ..మద్దతుగా నిలుస్తున్న నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం పూర్తి సాక్ష్యాలు..ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని చెబుతోంది. ఇటు చంద్రబాబు పైన పెండింగ్ లో ఉన్న కేసుల్లో సీఐడీ వరుసగా పిటీ వారెంట్లు దాఖలు చేస్తోంది. వీటి పైన చంద్రబాబు న్యాయవాదులు హైకోర్టులో మందుస్తు బెయిల్ పిటీషన్లు దాఖలు చేసారు. అటు చంద్రబాబు రిమాండ్ వ్యవహారం ఏసీబీ కోర్టు(ACB Court)లో పెండింగ్ లో ఉంది. నేటితో చంద్రబాబుకు విధించిన రిమాండ్ ముగియనుంది. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా చంద్రబాబు విచారణకు హాజరు కానున్నారు. రిమాండ్ పొడిగింపు పైన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు.

Behind the Scandal: Vundavalli Arunkumars CBI Petition Sheds Light on Skill Development Fraud

సీబీఐ విచారణ ద్వారా : ఇదే సమయంలో అనూహ్యంగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కేసులో తెర మీదకు వచ్చారు. హైకోర్టు(High Court)లో పిల్ దాఖలు చేసారు. అందులో స్కిల్ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. దీని ద్వారా స్కిల్ స్కాం(Skill Scam)లో సమగ్ర దర్యాప్తు జరపాలని పిటిషన్‌ లో అభ్యర్దించారు. 44 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్‌ లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ, ఈడీ, చంద్రబాబు, అచ్చెన్నాయుడు ను చేర్చారు. 241 కోట్ల దారి మళ్లింపు , పూర్తి నిందితుల జాబితాతో సవివరంగా వివరాలు ఉండవల్లి పొందుపరిచారు. దురుద్దేశ పూర్వకంగా , కుట్ర కోణంతో చంద్రబాబు నాయుడు సహకారం తో 241 కోట్ల దారి మళ్లింపు జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ పిల్ వ్యవహారం కొత్త చర్చకు కారణమైంది.

రాజకీయ ఉత్కంఠ : ఉండవల్లి చాలా కాలంగా మార్గదర్శి వ్యవహారంలో న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు కేసు పైన పిల్ దాఖలు చేయటంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ఇప్పటికే స్కిల్ స్కాం పైన ఈడీ, ఐటీ నుంచి అందిన సమాచారం మేరకే ఏపీ సీఐడీ(AP CID) పూర్తి ఆధారాలు సేకరించింది. ఇప్పటికే సీఐడీ విచారణ చేస్తున్న ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని ఉండవల్లి కోర్టును కోరారు. దీంతో, ఇప్పుడు కోర్టు పిటీషనర్ అభ్యర్ధన మేరకు సీబీఐ విచారణకు అంగీకరిస్తే ఏం జరుగుతుందనే చర్చ రాజకీయంగా మొదలైంది. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కేంద్ర విచారణ సంస్థల జోక్యం మొదలైతే ఎటువంటి ప్రభావం పడుతుందనే దాని పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో, ఉండవల్లి పిల్ పై కోర్టు నిర్ణయం పై ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+