గోదావరి జిల్లాల పొలం పనుల్లో బెంగాల్ కార్మికుల హవా!:రైతులకు లాభం...స్థానిక కూలీలకు నష్టం
తూర్పుగోదావరి:గత రెండేళ్లుగా ఉభయ గోదావరి జిల్లాల రైతులు మిగిలిన జిల్లాల్లో రైతులతో పోలిస్తే పొలంపనుల విషయంలో నిశ్చింతగా ఉంటున్నారు. అందుకు కారణం బెంగాల్ కూలీలు. అదెలాగంటే?...
పశ్చిమ బెంగాల్‌లోని కూలీలకు రెండేళ్లుగా పనులు లేకపోవడంతో వాళ్లు పొలం పనుల కోసమని రాష్ట్రంలోని ఉభయగోదావరి జిల్లాలకు వలస వస్తున్నారు. కారణం ఇక్కడ వరిసాగు పెద్దఎత్తున సాగుతుండటమే. ఇలా ఖరీఫ్, రబీ సీజన్లలో నాట్లు, కోతల సమయంలో భారీ సంఖ్యలో వలస వస్తున్న బెంగాల్ కార్మికులు వ్యవసాయ పనుల విషయంలోనూ వినూత్మమైన పద్దతుల్లో తక్కువ ఖర్చుతో స్వల్ప సమయంలోనే ఎక్కువపని చేసేస్తుండటం రైతులకు లాభదాయకంగా పరిణమిస్తోంది.

గోదావరి జిల్లాలకు...బెంగాల్ కూలీల రాక
ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారంగా ప్రసిద్ది చెందిన ఉభయ గోదావరి జిల్లాలు ఇప్పుడు బెంగాల కూలీలకు బాసటగా నిలుస్తున్నాయి. తమ రాష్ట్రంలో రెండేళ్లుగా తగినంత పనులు లేకపోవడంతో ఉపాధిని వెతుక్కుంటూ వారు గోదావరి జిల్లాలకు చేరుతున్నారు. గత ఏడాది ఇలా ఏడు ఎనిమిది వందల మంది ఇలా ఇక్కడకు పనుల కోసం రాగా ఈ ఏడాది ఆ సంఖ్య సుమారుగా 2000కి చేరింది.

కాంట్రాక్ట్...సబ్ కాంట్రాక్ట్
కారణాలేమైనా పశ్చిమ బెంగాల్‌లో గత కొన్నేళ్లుగా స్థానికంగా పనులు దొరక్కపోవడంతో అక్కడి కూలీలు వలసలు ప్రారంభించారు. ఇలా రెండేళ్లుగా వందలాదిమంది కూలీలు ఎపిలోని ఉభయగోదావరి జిల్లాలకు వస్తున్నారు. బెంగాల్‌లో ఒక ప్రధాన దళారీ జిల్లాలోని మరో స్థానిక దళారీకి వీరిని అప్పగించి, కాంట్రాక్టు పద్ధతిలో నాట్ల పనులు చేయిస్తున్నారు. ఇలా వలస వచ్చిన బెంగాల్ కార్మికులు పొలం పనుల కోసం 12 మంది ఓ జట్టుగా, 15 మంది మరో జట్టుగా ఏర్పడి ఎకరం యూనిట్‌గా తీసుకుని నాట్లు వేస్తున్నారు. ఇలా వీరు ఒక్క రోజులోనే ఎనిమిది నుంచి పదెకరాల్లో ఊడ్పులు పూర్తిచేస్తున్నారు. సాధారణంగా మన రాష్ట్రానికి చెందిన కూలీలు 4 ఎకరాల వరకు మాత్రమే ఊడ్పులు చేయగలుగుతారు. ఎకరానికి రూ.3,500 కాంట్రాక్టుకు తీసుకుని నాట్లు వేస్తున్నారని రైతులు చెబుతున్నారు.

వినూత్న పద్దతి...నాణ్యత, వేగం
అయితే ఈ బెంగాల్ నుంచి పొలం పనులకు వలస వచ్చే కార్మికులంతా పురుషులే కావడం గమనార్హం. వీరంతా నాట్లు వినూత్న పద్దతిలో వేస్తున్నారు. వీరు తక్కువలో తక్కువగా కేవలం మూడు మూనల చొప్పున నాట్లు వేగంగా వేసుకుంటూ ఊడ్పును స్వల్ప వ్యవధిలోనూ పూర్తిచేస్తుంటారు. ఇలా వారు వరినాట్లు వేసే పద్దతిలో యంత్రాల కంటే వేగంగా ఊడ్పులు పూర్తిచేస్తున్నారని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రోజుకు ఎనిమిది నుంచి పది ఎకరాల్లో నాట్లు వేసేస్తుండడంతో రైతులకు సమయం,డబ్బు, నారు ఆదా అవుతోంది.

చేను పలుచన...దిగుబడి దండి
అయితే ఇలా తక్కువ నారు వినియోగించడం వల్ల చేను సాధారణ పొలాలతో పోలిస్తే పలుచగా కనిపిస్తుంది. అయితే ఇలా తక్కువ నారు వినియోగించడం వల్ల చాలా లాభం ఉంటుందని రైతులు అంటున్నారు.తక్కువ నారుతో నాట్లు పూర్తవడం వల్ల చేనుకు దోమపోటు ఉండటంలేదని రైతులు చెబుతున్నారు. దీనివల్ల ఎకరానికి నాలుగైదు బస్తాల దిగుబడి అధికంగా ఉంటోందని, కూలీల కొరత తీరుతోందని, వారి చేత 10 ఎకరాల్లో నాట్లు వేయించాననీ కాజులూరు మండలం కోలంకకు చెందిన రామయ్య అనే రైతు వివరించారు.

ఇక్కడ భోజనం...కర్ణాటకకు పయనం
రెండేళ్లుగా కూలి పనుల కోసం ఉభయగోదావరి జిల్లాలకు జూన్ నెలలో వస్తున్నామని, రెండు నెలల పాటు ఇక్కడే ఊడ్పుల పనులు చేస్తున్నామని ఈ వలస కూలీలు తెలిపారు. రెండేళ్ల క్రితం ఇక్కడకు పనులకు వచ్చిన కొత్తల్లో కేవలం చపాతితోనే సరిపెట్టుకున్న బెంగాల్ కార్మికులు క్రమేణా ఆంధ్రా భోజనాన్ని అలవాటు చేసుకున్నారు. ప్రస్తుతం కాంట్రాక్టర్ వారికి కూరగాయల భోజనాన్నే అందిస్తున్నాడు. ఇక్కడ ఉభయగోదావరి జిల్లాలో వరి నాట్ల పనులను పూర్తి చేసుకుని ఆగస్టు మూడో వారం నాటికి కర్నాటక రాష్ట్రంలోని ఆల్‌మట్టీ డ్యాం ఆయకట్టుల్లో ప్రారంభమయ్యే నాట్ల పనులకు వెళ్తామని బెంగాల్ లోని జార్కలికి చెందిన ఒక వలస కార్మికుడు తెలిపాడు. అక్కడ నెల రోజులు పనులుంటాయని చెప్పారు.

స్థానిక కూలీలు...ఆవేదన
అయితే బెంగాల్ కార్మికులు వేల సంఖ్యలో ఉభయ గోదావరి జిల్లాల్లో పనులకు రావడం వల్ల తమకు పనులు దక్కకుండా పోతున్నాయని స్థానిక మహిళా కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్ కూలీలు చవకగా, తమ కంటే వేగంగా తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ విస్తీర్ణంలో పనులు పూర్తి చేస్తుండటం...వారు నాట్లు వేసే పద్దతి వేరుగా ఉండటం...జట్లుగా పనుల్లోకి వస్తుండటం వలన విడిగా తమతో నాట్లు వేయించేందుకు రైతులు మొగ్గుచూపడం లేదని...వారితో కలసి పనిచేసేందుకు అవకాశం ఉండవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బెంగాల్ కూలీలు...వ్యవసాయ శాఖ
వ్యవసాయ శాఖ అధికారులు కూడా కూలీలకు అధునాతన, సాంకేతిక పద్దతుల్లో నాట్లు వేసేలా అవగాహన కల్పించే ప్రయత్నం చేయకపోవడం, శిక్షణ ఇవ్వకపోవడం సరికాదని స్థానిక కూలీలు తప్పుబడుతున్నారు. మరోవైపు బెంగాలీ కూలీలను వ్యవసాయ శాఖ అధికారులు ప్రశంసిస్తున్నారు. వీరు వేగంగా...నాణ్యతతో పనిచేయడం వల్ల తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయ ప్రణాళికను చక్కగా అమలు చేయగలుగుతున్నామని, వారు ఒక్క రోజులోనే 10 ఎకరాల్లో నాట్లు వేస్తున్నారని వ్యవసాయ శాఖ తూర్పు గోదావరి జిల్లా సంయుక్త సంచాలకులు సిహెచ్‌వి ప్రసాద్ చెప్పడం విశేషం.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications