పవన్ కల్యాణ్‌కు బేతపూడి గ్రామస్థుల షాక్: అడ్డు తగలొద్దని హితవు
అమరావతి: భూసేకరణ చట్టం నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందు నుంచే ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న జనసేన అధినేత, టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్‌కు నవ్వాంధ్ర పరిధిలోని బేతపూడి గ్రామస్థులు షాకిచ్చారు.
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం సేకరిస్తున్న భూములకు సంబంధించి అడ్డు తగలొద్దని ఆయనకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వ్యాఖ్యలకు తీరుకు నిరసనగా వారు ఆందోళన చేశారు.

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి సహకరించకపోయినా ఫర్వాలేదు కానీ, అడ్డు మాత్రం తగలొద్దని పవన్ కళ్యాణ్‌కు సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న భూ సేకరణకు తామంతా అనుకూలమేనని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి భూసేకరణ కోసం ప్రభుత్వం విడుదల చేసిన భూసేకరణ చట్టం ఇబ్బందులు తెస్తోంది.
దీనిని విపక్షాలతో పాటు గత సార్వత్రిక ఎన్నికల్లో మద్దతు పలికిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా విభేదిస్తున్నారు. రాజధాని కోసం పచ్చని పంటపొలాలను తీసుకోవద్దని, రైతులను ఒప్పించి తీసుకోవాలని విపక్షాలు, జనసేన డిమాండ్ చేస్తోంది. బలవంతంగా భూములు తీసుకుంటే మాత్రం ఊరుకునేది లేదని, కోర్టుకు కూడా వెళ్తామని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications