ప్రస్తుతం రాష్ట్రపతిపాలన నో: ఇవే బాబు, జగన్‌ల లేఖలు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులు మద్దతిచ్చి ఇప్పుడు అవకాశవాదంతో మాట మార్చారని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు తెలంగాణకు మద్దతుగా ఇచ్చిన లేఖలను ఆయన చదివి వినిపించారు. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన తప్ప మరో మార్గం లేదని ఇంకొందరు చెబుతున్నారు.
సీమాంధ్రులో ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సునిశితమైన అంశంపై సీమాంధ్ర ప్రజల ఆవేదనను ప్రభుత్వం గౌరవిస్తుందని, మీ ఆందోళనను అర్థం చేసుకుంటోందని, మీ సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని, అందుకు కట్టుబడి ఉన్నామని, చర్చల ప్రక్రియకు అవసరమైన ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కోరారు.
సీమాంధ్రులు లేవనెత్తుతున్న సమస్యలను ముఖ్యంగా తెలంగాణలో ఉంటున్న వారి హక్కులకు రక్షణ, హైదరాబాదులో యువతకు విద్య, ఉద్యోగవకాశాలు, నీటి పంపకాలు వంటి అంశాలను పరిష్కరిస్తామన్నారు. కొత్త రాష్ట్ర ఏర్పాటుపై నియమించిన మంత్రుల ఉపసంఘం ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటుందన్నారు.












Click it and Unblock the Notifications