ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11నుంచి భవానీ దీక్షలు ప్రారంభం.. 40రోజులపాటు..
ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో విజయవాడ ఇంద్రకీలాద్రీపై భవానీ దీక్షలు ప్రారంభమవుతాయి. ఇక, ఈసారి దీక్షలు ఈనెల (నవంబర్ ) 11 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ దీక్షల్లో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. ఏటా ఈ దీక్షలకు లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తుంటారు. భవానీ దీక్షలు సుమారు 40 రోజులపాటు సాగుతాయి. భవానీ దీక్షలను ఒక్క తెలుగు రాష్ట్రాలవారే కాకుండా ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల వారు కూడా ధరిస్తారు.
నవంబర్ 11వ తేదీ ఉదయం 11గంటలకు మండల దీక్ష స్వీకరణతో ఈ దీక్షలు ప్రారంభవుతాయి. ఈనెల 15వ తేది వరకు దీక్షల స్వీకరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. 2007 వరకు దసరా ఉత్సవాలతో పాటు భవానీ దీక్షల కార్యక్రమాలు జరిగేవి. కానీ, భవానీలు దీక్షల విరమణ చేసే సమయంలో జరిగిన తొక్కిసలాటలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగడంతో దసరా ఉత్సవాలతో సంబంధం లేకుండా భవానీ దీక్షల్ని నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 1వ తేదీన అర్థమండల దీక్ష స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ దీక్షలు డిసెంబర్ 5న ముగుస్తాయి. వచ్చే నెల (డిసెంబర్) 21వ తేదీ నుంచి దీక్షల విరమణ ఉంటుంది. 25వ తేదీ వరకు దీక్షల విరమణ కొనసాగుతుంది. డిసెంబర్ 25న ఉదయం 10 గంటలకు మహాపూర్ణాహుతితో దీక్షలు ముగుస్తాయి.

పలు సేవలు రద్దు..
భవానీ దీక్షల విరమణ సమయంలో భక్తులు పెద్ద ఎత్తున విజయవాడ తరలి వస్తారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు ఆలయంలో పలు కార్యక్రమాలను రద్దు చేశారు. డిసెంబర్ 21వ తేది నుంచి 26వ తేది వరకు ఆలయంలో ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవల్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారికి జరిగే ఏకాంత సేవల్ని మాత్రమే నిర్వహిస్తున్నట్లు వివరించారు.












Click it and Unblock the Notifications