చంద్రబాబు పుట్టినరోజుకు రూ.44 లక్షలు

CM Chandrababu Birthday: నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పుట్టినరోజు. 75వ జన్మదిన వేడుకలను జరుపుకొంటోన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తోన్నారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబుకు పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తోన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

Bhaysam Ramakrishna donates Rs 44 lakhs to TTD on the occasion of Chandrababu s birthday

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉన్న రాజకీయ, పరిపాలన అనుభవాల గురించి ఇందులో ప్రస్తావించారు. వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విజన్‌కు అనుగుణంగా పరిపాలన సాగించగలదక్షుడిగా ప్రశంసించారు.

చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాద పథకానికి 44 లక్షల రూపాయల విరాళం అందింది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఒక రోజు అన్న ప్రసాద వితరణ కోసం ఈ మొత్తాన్ని టీటీడీ అధికారులు ఖర్చు చేశారు.

భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ఈ 44 లక్షల రూపాయల మొత్తాన్ని టీటీడీ అన్నప్రసాద పథకానికి విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి.. దాత భాష్యం రామకృష్ణతో కలిసి అన్న ప్రసాద కేంద్రానికి వెళ్లారు. భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాలను స్వయంగా వడ్డించారు

ఈ సందర్భంగా అన్నప్రసాదాల రుచి, నాణ్యతపై నెల్లూరు, గుంటూరు, హైదరాబాద్, కర్నూలు నుంచి వచ్చిన శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో బీఆర్ నాయుడు మాట్లాడారు. వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అన్నప్రసాదాల రుచి, నాణ్యత బాగుందంటూ భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+