భీమ్లా నాయక్ పోస్టర్ ట్వీట్ చేసిన నారా లోకేష్: చిప్ప చేతికిస్తాడంటూ ఘాటు కామెంట్స్
అమరావతి: పవన్ కల్యాణ్-రానా నటించిన మల్టీ స్టారర్ మూవీ భీమ్లా నాయక్.. ఇవ్వాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లో మల్టీ స్క్రీన్లలో ప్రదర్శితమౌతోంది. హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. సాగర్ కే చంద్ర దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్- ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే సమకూర్చారు. స్క్రీన్‌ప్లేతో మాయాజాలం చేశారాయన. మలయాళం సినిమాకు రీమేక్ అయినప్పటికీ..స్క్రీన్‌ప్లే వల్ల ఫ్రెష్‌నెస్ కనిపించిందని అభిమానులు చెబుతున్నారు.

విడుదలకు ముందు వివాదాస్పదం..
ఈ మూవీ విడుదల కూడా వివాదాస్పదమైంది. బెనిఫిట్ షోలను ప్రదర్శించడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. నిబంధనలకు విరుద్ధంగా బెనిఫిట్ షోలను ప్రదర్శించిన సినిమా థియేటర్ల యాజమాన్యంపై కఠిన చర్యలను తీసుకుంటామంటూ రెవెన్యూ అధికారులు హెచ్చరికలను జారీ చేశారు కూడా. తెలంగాణలో బెనిఫిట్ షోలతో పాటు అయిదో ఆటను ప్రదర్శించడానికీ అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఇదివరకే జారీ చేసింది.

నో బెనిఫిట్ షో..
ఏపీలో భీమ్లా నాయక్ బెనిఫిట్ షోనకు అనుమతి ఇవ్వకపోడం పట్ల అభిమానులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోన్నారు. రాజకీయ కక్షసాధింపు చర్య వల్లే- ప్రభుత్వం పవన్ కల్యాణ్ నటించిన సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందంటూ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ సినిమాను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం జీవో నంబర్ 35ను జారీ చేసిందని, దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందంటూ ధ్వజమెత్తుతున్నారు.

నారా లోకేష్ ట్వీట్..
పవన్ కల్యాణ్ అభిమానులతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా గళం కలిపారు. భీమ్లా నాయక్ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తున్నట్లు తనకు సమాచారం అందిందని అన్నారు. ఈ సినిమాను తాను ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. త్వరలోనే ఈ మూవీని చూస్తాననీ చెప్పారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన ఓ ట్వీట్ చేశారు.
ఒక్కో పరిశ్రమ నిర్వీర్యం..
తెలుగు చలన చిత్ర పరిశ్రమను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూరకంగా ఇబ్బందులకు గురి చేస్తోన్నారంటూ నారా లోకేష్ విమర్శించారు. ఒక్కో పరిశ్రమను నిర్వీర్యం చేసుకుంటూ వస్తోన్నారని మండిపడ్డారు. ఇప్పటికే పరిశ్రమలన్నీ పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయని ఆరోపించారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీపై రాజకీయంగా కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. ఒక్కో రంగాన్ని, పరిశ్రమను నిర్వీర్యం చేయడం వల్ల రాష్ట్రాన్ని అడుక్కునే పరిస్థితికి తీసుకుని రావాలనేదే వైఎస్ జగన్ ఉద్దేశమని మండిపడ్డారు. ఈ పరిస్థితి నుంచి భీమ్లా నాయక్ బయటపడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

హిట్ టాక్..
కాగా- భీమ్లానాయక్ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలైన ప్రతీచోటా సూపర్ హిట్ అనే వార్తలు వస్తోన్నాయి. సినిమా హిట్ కావడంతో పవన్ కల్యాణ్ అభిమానులు పండగ చేసుకుంటోన్నారు. థియేటర్లకు పోటెత్తుతున్నారు. వకీల్ సాబ్ తరువాత పవన్ కల్యాణ్ నటించిన సినిమా ఇదే. ఇందులో రానా మరో హీరోగా నటించడం వల్ల అంచనాలు మరింత పెరిగాయి. మలయాళ మూవీ అయ్యప్పనుమ్ కోశియమ్‌కు రీమేక్ అయినప్పటికీ- ఆ ఛాయలేవీ ఈ మూవీపై పడకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డారని అభిమానులు అంటున్నారు.












Click it and Unblock the Notifications