Bhimavaram Assembly Election 2024 Results LIVE: భీమవరంలో గెలిచిన పార్టీకే రాష్ట్రంలో అధికారం
భీమవరం అసెంబ్లీ ఎన్నికల 2024 ఫలితాలు ప్రత్యక్ష ప్రసారాలు: పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరానికి వాణిజ్య, రాజకీయ రాజధానిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేకాదు భీమవరం నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే విజయం సాధిస్తుందో ఆ పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుంది అన్న పేరు కూడా ఉంది. 2024 అసెంబ్లీ ఎన్నికలలో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాలలో భీమవరం ఒకటి. ఇది నర్సాపురం లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది.
ఏపీ ఎన్నికల కౌంటింగ్ లో భీమవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు దూకుడును కొనసాగిస్తున్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థి పై వైసిపి అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ పై 7 రౌండ్ పూర్తయ్య సరికి 31600 మెజారిటీ సాధించారు. భీమవరంలో గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుందని ఏపీలో ప్రజలు బలంగా నమ్ముతారు. ఈ క్రమంలో భీమవరంలో తాజా ట్రెండ్ కూటమికే అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది.
భీమవరం పాలిటిక్స్ ను శాసించేది ఈ సామాజికవర్గాలే
భీమవరం నియోజకవర్గంలో మొత్తం 2.51 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. భీమవరం ఓటర్లలో కాపు సామాజిక వర్గానికి చెందిన వారే మెజారిటీ ఓటర్లు. జిల్లా రాజకీయాలన్నీ ఈ నియోజకవర్గంలో ఉన్న కాపు, రాజుల సామాజికవర్గాలే శాసిస్తాయి. మరి ఈసారి భీమవరం నియోజకవర్గంలో గ్రంధి శ్రీనివాస్ వర్సెస్ పులపర్తి రామాంజనేయులు చేసిన ఎన్నికల పోరాటంలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి.

గత ఎన్నికల్లో పవన్ పోటీతో పెరిగిన క్రేజ్
2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదే నియోజకవర్గంలో పోటీ చేయడంతో భీమవరం నియోజకవర్గానికి రాష్ట్రంలో క్రేజ్ పెరిగింది. 2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక తాజా ఎన్నికలలో భీమవరం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అని అంతా భావించినా, ఆయన పోటీ చేయలేదు.
పులపర్తి రామాంజనేయులు వర్సెస్ గ్రంధి శ్రీనివాస్
భీమవరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీకి ఈ స్థానం కేటాయించడంతో టిడిపి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులు ఎన్నికల బరిలోకి దిగారు. గతంలో టిడిపి ఎమ్మెల్యేగా రెండుసార్లు విజయం సాధించిన ఆయన, కూటమి పొత్తుల నేపథ్యంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేన నుంచి పోటీచేసి, వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పై హోరాహోరీ సమరం చేశారు.
2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమి, గ్రంధి విజయం
2019 ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం లో త్రిముఖ పోటీ జరిగింది. వైసీపీ నేత గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌కు 70 వేల 643 ఓట్లు రాగా, పవన్ కళ్యాణ్‌కు 62 వేల 288 ఓట్లు వచ్చాయి. ఇక టీడీపీ తరఫున పోటీ చేసిన రామాంజనేయులుకు 52 వేల ఓట్లు వచ్చాయి.
గ్రంధి గెలుపు ధీమా వెనుక
మొత్తం 8,357 ఓట్లతో గెలిచిన శ్రీనివాస్ మరోసారి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తానని ధీమాతో ఉన్నారు. ఏపీ సీఎం గా జగన్ అందించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు మళ్లీ వైసీపీకి పట్టం కడతాయని గ్రంధి శ్రీనివాస్ భావిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ నే ఓడించిన తనకు ఈ సారి కూడా ప్రజల మద్దతు లభిస్తుందని గ్రంధి శ్రీనివాస్ భావిస్తున్నారు. గెలుపుపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
పులపర్తి గెలుపు ధీమా వెనుక
గత ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసిన రామాంజనేయులు కు 52,000 ఓట్లు రావడం, అప్పుడు అక్కడ పోటీ చేసిన జనసేన అభ్యర్థి ఆయన పవన్ కళ్యాణ్ కు 62 వేలకు పైగా ఓట్లు రావడంతో ఈసారి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన విజయం సునాయాసం అవుతుందని పులపర్తి భావిస్తున్నారు. టిడిపి, జనసేన, బిజెపిల ఓటు బ్యాంకు తనకే పడుతుందని బలంగా నమ్ముతున్నారు పులపర్తి రామాంజనేయులు. ఈసారి భీమవరంలో వీరిద్దరిలో ఎవరు గెలిచినా వారు మూడోసారి ఎమ్మెల్యేగా అవకాశాన్ని దక్కించుకున్నట్టు అవుతుంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications