దొంగచాటుగా బోట్ నడిపారు, విమర్శించడం తేలిక: వైసీపీపై అఖిలప్రియ

Posted By:
Subscribe to Oneindia Telugu
Boat capsizes in Vijayawada : బోటు ప్రమాదంలో తప్పు ప్రయాణికులదే !

అమరావతి: కృష్ణా జిల్లాలో పడవ ప్రమాదంపై మంత్రి భూమా అఖిలప్రియ స్పందించారు. ఆమె సోమవారం సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

ప్రమాదంపై జగన్, మీకు చేతకాకుంటే మేమొచ్చాం: ఊగిపోయిన వైసిపి నేత, తొలుత స్పందించింది వారే

ప్రభుత్వాన్ని విమర్శించడం తేలిక

ప్రభుత్వాన్ని విమర్శించడం తేలిక

ఎవరికైనా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం చాలా సులభం అని అఖిల అన్నారు. అది ప్రయివేటు బోటు అని, అందులో ఎక్కవద్దని పర్యాటక శాఖ అధికారులు చెప్పారని ఆమె అన్నారు. అయినప్పటికీ వారు ఎక్కారని చెప్పారు. పర్యాటకశాఖ అధికారులు వెంటనే స్పందించి సహాయకచర్యలు చేపట్టారన్నారు.

యాక్షన్ తీసుకుంటాం

యాక్షన్ తీసుకుంటాం

బోటు ప్రమాదంపై పర్యాటక శాఖ తరఫున చర్యలు తీసుకుంటామని అఖిలప్రియ చెప్పారు. అందులో మా డిపార్టుమెంటు వాళ్లు ఉన్నా యాక్షన్ తప్పదని తెలిపారు. పడవ ప్రమాదం చాలా బాధాకరం అన్నారు.

 అనుమతి లేకుండా, పెద్దబోట్లకు అనుమతివ్వలేదు

అనుమతి లేకుండా, పెద్దబోట్లకు అనుమతివ్వలేదు

అనుమతి లేకుండా దుర్గాఘాట్ నుంచి సదరు ప్రయివేటు బోటు సంస్థ నడిపిందని అఖిలప్రియ అన్నారు. పెద్ద బోట్లకు అక్కడ అనుమతి ఇవ్వలేదని చెప్పారు. స్పీడ్ బోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చామన్నారు.

 దొంగచాటుగా బోటు నడిపారు

దొంగచాటుగా బోటు నడిపారు

దుర్గాఘాట్‌లో ఈ బోట్‌ను పర్యాటక శాఖ అడ్డుకున్నదని అఖిల చెప్పారు. అయినప్పటికీ దొంగచాటుగా వారు దానిని నడిపారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన బోట్లలో లైఫ్ జాకెట్లు లేవన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Tourism Minister Bhuma Akhila Priya on Monday visited boat capsized place.
Please Wait while comments are loading...