• search
  • Live TV
కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీలోకి అఖిల ప్రియ రీ ఎంట్రీ-కాదంటే ప్లాన్ బీ రెడీ : టీడీపీ నాయకత్వంపై గుర్రు- పెరుగుతున్న ఒత్తిడి..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ రాజకీయంగా కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. తల్లి మరణంతో రాజకీయంగా ఎంట్రీ ఇచ్చిన అఖిలప్రియ వైసీపీ ఎమ్మెల్యేగా పని చేసారు. తండ్రి నాగిరెడ్డితో కలిసి అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే, ఆ సమయంలో చోటు చేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాలతో తండ్రితో కలిసి టీడీపీలో చేరారు. తండ్రి మరణం తరువాత అఖిల వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఇక, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు.

కష్టాల్లో టీడీపీ అండగా నిలబడలేదంటూ

కష్టాల్లో టీడీపీ అండగా నిలబడలేదంటూ

ఇక, ఆ తరువాత అఖిలప్రియ వరుసగా వివాదాల్లో చిక్కుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లోని ఒక స్థలం వివాదంలో కేసులు ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులను బెదిరించిన కేసులో అఖిల ప్రియ భర్త..సోదరుడు మరి కొందరి పైన కేసులు నమోదయ్యాయి. అయితే, ఆ కేసుల సమయంలోనూ..నియోజకవర్గంలోని కొందరు టీడీపీ నేతలు తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నా టీడీపీ అధినాయకత్వం తమకు మద్దతుగా నిలబడలేదనే అభిప్రాయం అఖిల ప్రియ మద్దతు దారుల్లో కనిపిస్తోంది.

గంగుల కుటుంబానికి వ్యతిరేకంగా

గంగుల కుటుంబానికి వ్యతిరేకంగా

అదే సమయంలో తొలి నుంచి భూమా ప్రత్యర్ధి వర్గంగా ఉన్న గంగుల కుటుంబం ఇప్పుడు ఆళ్లగడ్డలో పైచేయి సాధిస్తోంది. అక్కడ గంగుల వారసుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో..ఇప్పుడు పార్టీ మార్పు పైన అఖిల వర్గం ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. వైసీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చే అంశం పైన గతంలోనే అఖిల ప్రయత్నాలు చేసారు. సీఎం జగన్ తల్లి విజయమ్మ తో సంప్రదించినట్లుగా అప్పట్లోనే ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు వైసీపీలోకి వెళ్లాలని అనునచరులు కొందరు సూచిస్తున్నట్లు సమాచారం.

వైసీపీలోకి రీ ఎంట్రీ ప్రయత్నాలు..

వైసీపీలోకి రీ ఎంట్రీ ప్రయత్నాలు..

దీంతో..వైసీపీలోని కొందరు ముఖ్యుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అఖిల రీ ఎంట్రీ విషయంలో జగన్ అంగీకరిస్తారా లేదా అనేది సందేహంగానే ఉంది. ఇదే సమయంలో బీజేపీ-జనసేన వైపు సైతం అఖిల ఆసక్తిగా ఉన్నారని సమాచారం. ఇదే సమయంలో టీడీపీ కార్య‌క‌ర్త‌లు, గ్రామ‌స్థాయి నాయ‌కులు అఖిల‌ప్రియ అన్న ,బీజేపీ నేత భూమా కిషోర్‌రెడ్డికి ద‌గ్గ‌ర‌వుతున్నారు. బీజేపీ కంటే జనసేనకు వెళ్లటం మంచిదనే అభిప్రాయంతో అఖిల ఉన్నట్లుగా చెబుతున్నారు

జగన్ కాదంటే పవన్ పార్టీలోకి ఖాయమేనా

జగన్ కాదంటే పవన్ పార్టీలోకి ఖాయమేనా

పవన్ కళ్యాణ్ తో భూమా కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయి. ప్రజారాజ్యం నుంచి శోభా నాగిరెడ్డి పోటీ చేసి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే సమయంలో నంద్యాల నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచే నాగిరెడ్డి ఎంపీ అభ్యర్దిగా పోటీ చేసి..ఓడిపోయారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలోనూ జనసేన తమ అభ్యర్ధిని నిలబెట్టలేదు. భూమా కుటుంబానికి మద్దతుగా నిలిచారు. దీంతో.. ఇప్పుడు జనసేనలో చేరటం ద్వారా..ఆళ్లగడ్డలో అధికంగా నివసించే బలిజ సామాజిక వర్గం దగ్గరవుతుందనే అభిప్రాయం అఖిల వర్గంలో కనిపిస్తోంది.

త్వరలోనే అఖిల నిర్ణయం అంటూ ..

త్వరలోనే అఖిల నిర్ణయం అంటూ ..

అదే విధంగా.. నియోజకవర్గంలో తమకు పోటీగా ఉన్న గంగుల కుటుంబాన్ని ఎదుర్కోవాలంటే.. జనసేన సరైన వేదికగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, కుటుంబ సభ్యులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే, జనసేన - బీజేపీ మధ్య పొత్తు ఉన్న ఈ పరిస్థితుల్లో జనసేనలో చేరటం ద్వారా..ఎన్నికల సమయానికి ఎటువంటి సమీకరణాలు మారినా..తమకు భవిష్యత్ ఉంటుందనే ఆలోచనలో అఖిల శిబిరం ఉన్నట్లు సమాచారం. అయితే, దీని పైన మరి కొద్ది రోజుల్లోనే అఖిల ప్రియ కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది. మరి..అఖిల వైసీపీ లో రీ ఎంట్రీ ఇస్తారా లేక..పవన్ కళ్యాణ్ పార్టీలో చేరుతారా అనేది త్వరలోనే తేలే అవకాశం కనిపిస్తోంది.

English summary
News is making rounds that TDP leader Bhuma Akhilapriya is willing to join YSRCP, if not she will join Janasena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X