భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు

వైసీపీలో తిరుగుబాటు చేస్తోన్న ఎమ్మెల్యేల వ్యవహారం రాష్ట్రంలో ప్రధాన అంశంగా మారింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. నెల్లూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపార్టీని వీడబోతున్నట్లు ప్రకటించడం.. మరొక ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బహిరంగంగా అసంతృప్తి గళం వినిపించడం రాష్ట్రంలో చర్చనీయాంశాలుగా మారాయి. ఈ క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన మరో వైసీపీ ఎమ్మెల్యే తెలుగు దేశం పార్టీతో టచ్‌లో ఉన్నారని మాజీ మంత్రి భమా అఖిలప్రియ ప్రకటించడం సంచలనంగా మారింది.

నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డి తెలుగు దేశం పార్టీ వైపు చూస్తున్నారని అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవి.. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులతో టచ్‌లో ఉన్నారని, టీడీపీలో చేరేందుకు ఎమ్మెల్యే రవి రంగం సిద్ధం చేసుకుంటున్నారని చెప్పారు.

bhuma akhilapriya sensational comments

ఈనెల 4న తేదీన ఎమ్మెల్యే శిల్పా రవి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానని ప్రకటించారు. తాను చేసిన అక్రమాలను ఎమ్మెల్యే శిల్పా రవి కూడా బయట పెట్టాలని అఖిలప్రియ సవాల్ విసిరారు. ఈ నెల 4న నంద్యాలలోని గాంధీ చౌక్ దగ్గరికి రవిచంద్రకిషోర్ రెడ్డి అక్రమాల చిట్టా తీసుకొస్తానని, తాను అక్రమాలకు పాల్పడ్డానంటూ ఎమ్మెల్యే శిల్పా రవి ఆరోపణలు చేస్తున్నారని, వాటిని ఆధారాలతో సహా నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

అఖిలప్రియ వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి పోటీచేయాలని భావిస్తోంది. అయితే సీటు విషయంలో ఇంతవరకు ఆమెకు చంద్రబాబు హామీ ఇవ్వలేదు. ఆళ్లగడ్డతోపాటు నంద్యాల సీటు కూడా తమ కుటుంబానికి కేటాయించాలని కోరుతోంది. నంద్యాల నుంచి తన తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి పోటీచేస్తాడనే ప్రతిపాదనను అధిష్టానం ముందు ఉంచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+