పవన్ కళ్యాణ్‌కు భూమా నాగిరెడ్డి కృతజ్ఞతలు

హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కళ్యాణ్‌కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమా నాగిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా పవన్ కళ్యాణ్ కృషి చేశారని భూమా నాగిరెడ్డి చెప్పారు.

ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విజయాన్ని తన తల్లి శోభానాగిరెడ్డికి అంకితం చేస్తున్నట్లు అఖిలప్రియ తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా సహకరించిన ప్రధాన పార్టీలకు, నాయకులకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.

కాగా, భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో ఏకగీవ్రంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శుక్రవారం మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించారు. ఎన్నికల బరిలో ఉన్న ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో అఖిలప్రియ ఎన్నిక లాంఛనప్రాయమైంది.

Bhuma Nagi Reddy thanked Pawan Kalyan

హత్యా రాజకీయాలు: బాబుపై భూమా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై హత్యా రాజకీయాలు, దాడులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబునాయుడుకు ముందు నుంచీ కూడా హత్యా రాజకీయాలు అలవాటేనని అన్నారు. చంద్రబాబు పరిపాలనా కాలమైన 1999-2004 వరకు 400మంది హత్యకు గురయ్యారని తెలిపారు. దివంగత సిఎం రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డిని హత్య చేసిన వారికి టిడిపి ఆఫీసులోనే వసతి కల్పించిన ఘనత చంద్రబాబుదే అని విమర్శించారు. తమ పార్టీ అధినేత జగన్ నేతృత్వంలో హత్యా రాజకీయాలను ఎదిరిస్తామని, తమ పార్టీ నేతలు, కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+