రెండు గంటల ఉత్కంఠకు తెర: భూమా, శిల్పా నామినేషన్లు సక్రమమే

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: రెండుగంటలపాటు నెలకొన్న ఉత్కంఠకు తెరవీడింది. నంద్యాల అసెంబ్లీ స్థానంలో బరిలో ఉన్న టిడిపి, వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను సక్రమమేనని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. . వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి , టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి నామినేషన్లపై రెండు పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేసుకొన్నాయి.

నామినేషన్ దాఖలుచేసే సందర్భంగా వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి నిబంధనల ప్రకారంగా లేదని టిడిపి ఆరోపించింది. జ్యూడిషీయల్ స్టాంప్ పేపర్ వాడలేదన్నారు. అఫిడవిట్‌పై సంతకం చేసిన నోటరి రెన్యూవల్ కాలేదని టిడిపి అభ్యంతరం వ్యక్తం చేసింది.

bhuma, silpa nominations accepts: Election officer

అయితే టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదని, ఈ విషయం నుండి దృష్టి మరల్చేందుకు టిడిపి నేతలు నోటరీ అంశాన్ని ముందుకు తెచ్చారని వైసీపీ నేతలు ఆరోపించారు.

ఇరువర్గాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎదుట తమ వాదనలు విన్పించారు. రెండు వర్గాలు ఆర్‌డిఓ కార్యాలయం వద్ద భారీగా మోహరించాయి. అయితే ఏం జరుగుతోందోనననే ఉత్కంఠ నెలకొంది.

అయితే రెండు వర్గాల వాదనలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తోసిపుచ్చారు. టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్లు సక్రమమేనని తేల్చి చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tdp candidate Bhuma Brahmanandha reddy, Ysrcp candidate silpa Mohan reddy nominations are accepted
Please Wait while comments are loading...