పరిటాల-వైయస్ మధ్య.., దేవుడ్ని, కాపుల్ని అంటావా: బాబుపై భూమన

చిత్తూరు: వైసిపి అధినేత జగన్ కుటుంబానికి నేర చరిత్ర అని, కాపు గర్జన వెనుక వైసిపి పాత్ర ఉందని మహానాడు వేదికగా ఆరోపణలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబుపై వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం నాడు ధ్వజమెత్తారు.

పరిటాల రవీంద్ర, వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబాల మధ్య పగలు ఉన్నాయని చెప్పి నమ్మించే ప్రయత్నం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నారని మండిపడ్డారు. పరిటాల, వైయస్ కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్నారు.

పరిటాల రవి ఎదుగుదలను అడ్డుకున్నదే చంద్రబాబు అన్నారు. పరిటాల రాజకీయ జీవితాన్ని సమాధి చేసింది చంద్రబాబు అని ఆరోపించారు. ఏపీని రెండుగా విభజించడానికి కారణం కూడా బాబే అన్నారు. చిదంబరం, షిండేలకు లేఖ ఇచ్చారన్నారు. రోశయ్య ఏర్పాటు చేసిన అఖిల పక్షంలోని విభజనకు అనుకూలమని చెప్పారన్నారు. మహానాడు ఏర్పాటు చేసింది జగన్ పైన దాడి చేయడానికేనా అని ప్రశ్నించారు.

రాజధాని అవినీతి పైన తమ పార్టీ పోరాడుతుందని చెప్పారు. అమరావతిఅవినీతి పైన సీబీఐ విచారణ జరిపించాలన్నారు. చర్చ లేకుండా తమ పైన దాడికే మహానాడును పరిమితం చేశారని ధ్వజమెత్తారు. దమ్ముంటే తుని ఘటన పైన సీబీఐతో విచారణ జరిపించాలన్నారు.

ఔటర్ రింగ్ రోడ్డు పైన నాడు ఆరోపణలు వస్తే వైయస్ రాజశేఖర రెడ్డి సీబీఐతో విచారణ జరిపించారన్నారు. చంద్రబాబు కాపుల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. పాపాలు చేసిన వారు దేవాలయాలలోకి వెళ్లి హుండీలో డబ్బులు వేస్తారని చెప్పారని, కాపులే అలా చేస్తారని చంద్రబాబు అభిప్రాయపడ్డారని, అది సరికాదన్నారు.

Bhumana blames Chandrababu for his comments on devotees

మాల వేసుకుంటే అలాగంటారా

అయ్యప్పమాల వేసుకోవడం ద్వారా మద్యం వ్యాపారం జరగడం లేదని చంద్రబాబు ఆవేదన చెందుతున్నట్లుగా కనిపిస్తోందని, జనాలను మత్తులో ముంచాలనుకుంటున్నావా చంద్రబాబు అని ప్రశ్నించారు. కనీసం ఆ 41 రోజులు పవిత్రంగా ఉండనీయవా అని ప్రస్నించారు.

వెంకటేశ్వర స్వామి పవర్ ఫుల్ దేవుడు అంటారని, మరి భారతీయ సమాజం ముక్కోటి దేవతలను నమ్ముతుందని, వారిని లెక్క చేయవా అన్నారు. చంద్రబాబు తిరుమలలో తాను చేసిన తప్పులకు, నెరవేర్చని హామీలకు లెంపలు వేసుకోవాలన్నారు.

ఎమ్మెల్యేలను కొంటానని హామీ ఇవ్వకుండా అమలు

తాను ఇవ్వని హామీలను కూడా నెరవేర్చానని చంద్రబాబు చెప్పారని, కానీ అది పచ్చి అబద్దమన్నారు. అయితే, చంద్రబాబు తాను చేయని వాగ్ధానాలలో ఒక దానిని మాత్రం నెరవేర్చుతున్నారన్నారు. అది వైసిపి ఎమ్మెల్యేలను కొంటానని హామీ ఇవ్వలేదని, ఆ ఇవ్వని హామీని మాత్రం నెరవేరుస్తున్నాడన్నారు.

మహానాడు చక్కెర తీసేసిన పిప్పిలా మిగులుతుందన్నారు. అవకాశాన్ని సంక్షోభంగా మార్చుకునే ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా సంజీవిని కాదన్న మహాఘనుడు చంద్రబాబు అన్నారు. మహానాడులో ఊకదంపుడు ఉపన్యాసం చేశారన్నారు.

విజయ సాయి సరైన అభ్యర్థి

టిడిపిలో ఉన్న వారంతా గజదొంగలు అన్నారు. మంచి హృదయం, పార్టీకి మంచి సైనికుడిలా పని చేస్తున్న వంటి వ్యక్తి విజయ సాయి రెడ్డి అని, అందుకే ఆయనను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించామని చెప్పారు. విజయ సాయిని ప్రకటించినందుకు జగన్‌ను అభినందిస్తున్నానని చెప్పారు.

ముద్రగడ పద్మనాభంతో తనకు ఎన్నో ఏళ్ల సంబంధం ఉందని చెప్పారు. కాపు గర్జనలో జరిగిన రైలు దగ్ధం వెనుక తన హస్తం ఉందని చెప్పడం విడ్డూరమన్నారు. దీనిపై అవసరమైతే విచారణ జరిపించుకోవచ్చునని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+